టాలీవుడ్ లో స్టార్ హీరోగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన వకీల్ సాబ్ అనే సినిమాను షూట్ చేస్తున్నారు. ఈ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించిన ఒక పాటను కూడా ఇప్పటికే మహిళా దినోత్సవం సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. త్వరలోనే రెండో పాటను ఉగాది కానుకగా విడుదల చేసే అవకాశాలు కనపడుతున్నాయి.
ఇది పక్కన పెడితే ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో సినిమా చేయడానికి కొందరు దర్శక నిర్మాతలు ఎక్కువగా పోటీ పడుతున్నారు. ఆయన మరో రెండేళ్ళు సినిమాల మీదే దృష్టి పెట్టే అవకాశం ఉన్న నేపధ్యంలో ఆయన ఎన్ని సినిమాలు చేస్తారు అనేది అర్ధం కాని పరిస్థితి. దీనితో అవకాశం దొరక్కపోదా అంటూ దర్శకులు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఇక కొందరు అగ్ర నిర్మాతలు కూడా పవన్ వద్దకు వెళ్తున్నారు.
ప్రస్తుత౦ పవన్ కళ్యాణ్ గోదావరి జిల్లాల పర్యటనలో ఉన్నారు. ఈ పర్యటనలో ఆయనను ఒక నిర్మాత కలిసి సినిమాలు చేద్దామని కోరినట్టు సమాచారం. అయితే తాను ఎక్కువ రోజులు డేట్స్ ఇవ్వలేనని చెప్పెసారట. షెడ్యుల్ ఇస్తా అని ఆ షెడ్యుల్ ప్రకారం పూర్తి చేసుకోవాలని నిర్మాతకు పవన్ చెప్పడంతో సదరు నిర్మాత షాక్ అయినట్టు తెలుస్తుంది. దీనితో ఆయన పవన్ తో సినిమా చేసే ఆలోచనను దాదాపుగా రద్దు చేసుకున్నారట.