విజయ్ దేవరకొండ అనవసరంగా వేలు పెడుతున్నాడా…?

-

టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ కు అతి తక్కువ కాలంలో మంచి హీరోగా గుర్తింపు వచ్చిన మాట నిజం. పెళ్లి చూపులు సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గరైన విజయ్ దేవరకొండ ఆ సినిమా తర్వాత కాస్త రూటు మార్చాడు. అర్జున్ రెడ్డి తో ప్రేక్షకులను పలకదించాడు ఈ స్టార్ యువ హీరో. అతను టాలీవుడ్ లో ఇప్పుడు కాస్త డిమాండ్ ఉన్న యువ హీరోల్లో ఒకడిగా ఉన్నాడు. అతని తో సినిమాలు చేయడానికి కొందరు దర్శకులు పోటీ పడుతున్నారు.

భారీ బడ్జెట్ సినిమాలు చేయడానికి కూడా వెనుకాడే పరిస్థితి లేదు. అలాంటి విజయ్ దేవరకొండ అనవసరంగా తన కెరీర్ ని తానే ఇబ్బంది పెట్టుకునే విధంగా ప్రవర్తిస్తున్నాడు అనే ఆరోపణలు కొందరి నుంచి వినపడుతున్నాయి. సాధారణంగా యువ హీరోలు సినిమా కథల్లో పెద్దగా వేలు పెట్టే ప్రయత్నం చేయరు. సినిమా నచ్చితే చేయడం లేకపోతే ఆ సినిమాను పక్కన పెట్టడం, అంతే గాని కథ ఇలా ఉండాలి అలా ఉండాలి అనే డిమాండ్ ఎక్కడా ఉండదు.

కాని ఇక్కడ మాత్రం అందుకు పూర్తి భిన్నంగా పరిస్థితి ఉంది. తనకు నచ్చిన విధంగా కథను మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు ఈ హీరో. దీనితో అతనికి వరుస ఫ్లాపులు వస్తున్నాయని అతని అభిమానులు కూడా అంటున్నారు. అన్ని సినిమా కథలు ఒకేలా ఉండాలి, అదే జోనర్ లో చెయ్యాలి అంటే కుదరని పరిస్థితి. కాని ఇలాగే ఉంటే నన్ను చూస్తారు అనే భావనలో ఉండటం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news