2019లో దేవుడనుకుని ఓట్లేశారు.. ఇప్పుడు దెయ్యమై పట్టుకున్నాడు : పవన్‌

-

ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో పవన్ కల్యాణ్ వారాహి విజయయాత్ర సభలో జనసేన మాట్లాడుతూ.. స్వయంగా నేను గెలవకున్నా.. నిలబడి పోరాడుతున్నానంటే నా నిబద్జత ఏంటో అర్థం చేసుకోండన్నారు. జనసేన-టీడీపీ కూటమికి మద్దతివ్వండన్నారు. మళ్లీ జగనుకు ఓటేస్తే పరుస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండని, సమస్యలపై మాట్లాడుతోంటే నన్ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారన్నారు. అవనిగడ్డ ప్రాంతంలో ఇసుక దోపిడీ వల్ల 76 మంది ప్రాణాలు కొల్పోయారన్నారు.

Pawan Kalyan – I am one of the highest-paid actors in India | 123telugu.com

అంతేకాకుండా.. ‘ఏపీ భవిష్యత్ కోసం ఈసారి సరైన వ్యక్తులకు అండగా ఉండాలి. ఈసారి తేడా జరిగితే 20 ఏళ్లు వెనక్కు వెళ్లిపోతారు. నేనేం వెనక్కు వెళ్లను.. ఇక్కడే ఉంటాను. జగనుకేం ఊరికే ఓట్లు వేయలేదు.. పదేళ్లు రోడ్ల మీద తిరిగాడు. ఇప్పుడంటే పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు కానీ.. గతంలో రోడ్ల మీదే తిరిగాడు. 2019లో దేవుడనుకుని ఓట్లేశారు.. ఇప్పుడు దెయ్యమై పట్టుకున్నాడు. దేవుడు లేని ఊళ్లో.. మంచం కొయ్యే పోతురాజు అన్నట్టుగా ఉంది వైసీపీ ఎమ్మెల్యేల తీరు. ఏపీని పట్టి పీడిస్తోన్న వైసీపీ మహమ్మారికి మందే జనసేన-టీడీపీ వ్యాక్సిన్. వైసీపీ గుర్తు ఫ్యాన్.. ఎవ్వరికీ అందదు.. ఫ్యాన్ వేస్తే కరెంట్ బిల్లులు పేలతాయి.

ఏపీ అభివృద్ధిని.. నిరుద్యోగులను వైసీపీ ఫ్యానుకు ఊరేశారు. దాహం తీర్చే గ్లాసు.. ఓ చోటు నుంచి మరో చోటుకు చేర్చే సైకిల్ కలిశాయి. రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయి. బీజేపీతో కలిసి వెళ్లొచ్చు.. కానీ ప్రభుత్వం ఏర్పడే పరిస్థితి ఉండదు. ఈ ఎన్నికల్లో మధ్యే మార్గంగా ఉండను.. ఓ సైడ్ తీసుకుంటాను. రామ-రావణ యుద్దం జరుగుతున్నప్పుడు రామాయ స్వస్తి.. రావణయా స్వస్తి అనే రకం కాదు.

నేను ప్రజల కోసం ఓ సైడ్ తీసుకున్నాను. నన్ను బీసీలు.. ఎస్సీలతో తిట్టిస్తారు. నా చిన్నప్పుడు కూడా నేను ఇలాంటి పనులు చేయను. జగన్ ఇమ్మేచ్యూర్డుగా వ్యవహరిస్తున్నారు. జగనుకు ఎవరు సలహాలిస్తున్నారో.. కాస్త మార్చుకోండి. నన్ను విమర్శించే వారి కులం చూడను.. మనుషుల్నే చూస్తాను. ఒరిజనల్ ఆస్తి పత్రాలు ప్రభుత్వం దగ్గరుంటాయట. జిరాక్స్ కాగితాలు మనకిస్తారట. జనసేన-టీడీపీ కూటమికి సహకరించండి. తప్పు జరిగితే నేనే ప్రశ్నిస్తా. ‘ అని పవన్‌ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news