వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం : పవన్‌

-

పవన్‌ కల్యాణ్‌ నాల్గవ విడుత వారాహి విజయ యాత్ర నేడు ప్రారంభమైంది. వారాహి విజయయాత్రలో భాగంగా నేడు ఉమ్మడి కృష్ణా జిల్లా అవనిగడ్డలో భారీ బహిరంగ సభకు హాజరయ్యారు. ఈ సభలో ఆయన ప్రసంగిస్తూ.. ఏపీ భవిష్యత్తు దృష్ట్యా ఈసారి ఓటు చీలనివ్వకూడదు… వైసీపీని దించేయడమే మా లక్ష్యం. వచ్చే ఎన్నికల్లో గెలిచి జనసేన-టీడీపీ సంకీర్ణ ప్రభుత్వాన్ని స్థాపిస్తాం. గత ఎన్నికల్లో నేను గెలిచుంటే ఇవాళ డీఎస్సీ అభ్యర్థులు ఇలా ప్లకార్డులు పట్టుకుని నిలుచోవాల్సిన అవసరం వచ్చేది కాదు. జగన్ వంటి వేల కోట్లు దోచేసిన తర్వాత కూడా ఇంకా దోచుకుంటూనే ఉన్నాడు.

Pawan Kalyan's Varahi Yatra - A Turning Point in AP Politics! - Telugu  Rajyam

మీ వద్ద డబ్బులు ఉండకూడదని మీకు ఉద్యోగాలు ఇవ్వడు… నా దగ్గర డబ్బులు ఉండకూడదని నా సినిమాల టికెట్లు 5 రూపాయలు చేస్తాడు… అందరూ తన వద్ద దేహీ అనాలన్నది జగన్ ఆలోచన. జగన్ వంటి అధికార మదంతో ఉన్న వ్యక్తులను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. కానీ నా వద్ద ఓట్లు కొనడానికి డబ్బులు లేవు. దయచేసి రూ.500కి, రూ.2 వేలకు ఓట్లు వేయకండి… ఈ ఒక్కసారి ఆలోచించండి. వేల కోట్లు ఉన్న వ్యక్తితో, ప్రైవేటు సైన్యం కలిగిన వ్యక్తితో, అనుభవజ్ఞులైన నేతలను కూడా జైలుకు పంపిన వ్యక్తితో నేను తలపడుతున్నాను… దీన్నిబట్టే అర్థం చేసుకోండి మీ కోసం నేను ఎంత బలంగా నిలబడుతున్నానో.

నేను డబ్బు తీసుకున్నానని వైసీపీ సన్నాసులు వాగుతున్నారు. వీళ్లు డబ్బులు తీసుకుంటారు కాబట్టి నేను కూడా డబ్బులు తీసుకుంటానని అనుకుంటున్నారు. ఇదంతా పచ్చకామెర్ల వ్యవహారం. నేను కష్టపడి సంపాదించిన సొమ్ముతో పార్టీ నడుపుతున్నాను. కేవలం డబ్బు సంపాదించాలన్న ఆశ ఉంటే మాదాపూర్ ఏరియాలో 10 ఎకరాలు కొనేవాడ్ని. నా దృష్టంతా ప్రజలపైనే. రేపు ఎన్నికల్లో గెలిచి నాకు సీఎం పదవి వచ్చినా, ఇంకే పదవి వచ్చినా నా ఆలోచన అంతా అభివృద్ధి గురించే” అని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news