నేను అలాంటి కుటుంబం నుంచి వచ్చాను.. నన్ను అడ్డుకుంటారా : పవన్ కళ్యాణ్

-

ఇటీవలి తుఫాన్ కారణంగా భారీగా పంట నష్టపోయిన రైతులను పరామర్శించడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు అనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నెల్లూరులో పర్యటించారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా తనకు నెల్లూరు అంటే ఎంతో ఇష్టం అంటూ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కు స్వాగతం పలికేందుకు భారీగా అభిమానులు కూడా తరలివచ్చారు అయితే పవన్ కళ్యాణ్ పర్యటన ను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నాలు చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ రైతులను పరామర్శించి ధైర్యం చెప్పేందుకు వస్తే నన్నే అడ్డుకుంటారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఒక పోలీస్ కుటుంబం నుంచి వచ్చిన వాడిని అని… కానీ ప్రస్తుతం ఎంతో మంది పోలీసులు తమ కర్తవ్యాన్ని పక్కనపెట్టి వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు అంటూ మండిపడ్డారు. పోలీసులు ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి అని సూచించారు. రైతులకు అండగా నిలవడంలో వైసిపి పూర్తిగా విఫలం అయింది అంటూ విమర్శించారు.

Read more RELATED
Recommended to you

Latest news