వైరల్ లుక్ : నితిన్ పెళ్లికొడుకు ఫంక్షన్.. తళుక్కుమన్న పవన్..!

-

టాలీవుడ్ యంగ్‌ హీరో నితిన్‌ పెళ్లి వేడుకలు ఘనంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా నితిన్‌ను పెళ్లి కొడుకు చేసే ఫంక్షన్ ఇవాళ జరిగింది. అయితే ఈ ఫంక్షన్‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, నిర్మాత చినబాబులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ చాతుర్మాస్య దీక్ష దుస్తులతో కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోను నితిన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముఖ్యంగా అందులో పవన్ గెటప్ కూడా చాలా భిన్నంగా ఉంది.

నితిన్ కూడా తన వేడుకకు వచ్చిన పవన్, త్రివిక్రమ్, చినబాబుకు మనసారా కృతజ్ఞతలు తెలిపాడు. కాగా, జులై 26న ఈయన నితిన్ – షాలినిల వివాహం జరగబోతుంది. ఎప్పుడో ఎప్రిల్‌లోనే జరగాల్సిన పెళ్లి కాస్తా కరోనా కారణంగా ఇప్పటి వరకు వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పుడు కూడా ఘనంగా కాకుండా కరోనా నిబంధనలకు లోబడి ఈ పెళ్లి జరిపిస్తున్నారు కుటుంబ సభ్యులు. దీనికి టాలీవుడ్ నుంచి కానీ.. రాజకీయ రంగం నుంచి కూడా అతికొద్ది మంది మాత్రమే హాజరు కానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news