రిలయన్స్ కు చెందిన రీటైల్ ప్లాట్‌ఫాం జియోమార్ట్ రికార్డులు సృష్టిస్తుంది. తాజాగా ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్‌లో 10 లక్షల డౌన్‌లోడ్స్ మార్కును దాటింది. అలాగే గూగుల్ ప్లేస్టోర్‌లో షాపింగ్ కేటగిరీలో టాప్ 3 యాప్స్ లో జియోమార్ట్ ఉంది. అయితే జియోమార్ట్ 2024 నాటికి దేశంలో 50 శాతం మార్కెట్ షేర్ సాధిస్తుందని అమెరికన్ బ్రోకరేజీ సంస్థ గోల్డ్ మ్యాన్ శాక్స్ వెల్లడించింది.
ఇప్పటికే భారతదేశంలోని 200 నగరాలు, పట్టణాల్లో https://www.jiomart.com/ వెబ్‌సైట్ ద్వారా జియోమార్ట్ సేవలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు యాప్ కూడా వచ్చింది. జియోమార్ట్ యాప్‌కు భారీ స్పందన ఉంది. జియోమార్ట్‌లో అన్ని సరుకులపై 5 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాదు… పేటీఎం, మొబీక్విక్ లాంటి పేమెంట్ ఆప్షన్స్ ద్వారా డబ్బులు చెల్లించే వారికి క్యాష్ బ్యాక్ కూడా లభిస్తుంది. సొడెక్సో కూపన్స్ కూడా రీడీమ్ చేసుకోవచ్చు.