ఆ విషయం పవన్ కళ్యాణ్ నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు.. ఆలీ

-

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కమెడియన్ అలీ మధ్య ఉన్న అనుబంధం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే.. ఎన్నో ఏళ్ల నుంచి వీరి స్నేహబంధం కొనసాగుతోంది. పవన్‌ కళ్యాణ్‌ నటించిన ప్రతి సినిమాలో దాదాపుగా అలీ తప్పకుండా ఉంటారు. అయితే కొద్ది కాలం క్రితం నుంచి వీరిద్దరు కలిసి ఒకే చోట కనపడట్లేదు. ఇద్దరి మధ్య పలు విషయాల్లో విభేదాలు తలెత్తయని వాదనలు కూడా వినిపిస్తున్నాయి.. అయితే ఇంతవరకు ఈ విషయంపై వీరిద్దరూ ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు..

అయితే తాజాగా కొన్ని రోజుల క్రితం అలీ పెద్ద కుమార్తె వివాహం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్‌ సినీ సెలబ్రిటీలు మెగాస్టార్‌ చిరంజీవి, నాగార్జున దంపతులు, మంచు విష్ణు, తదితరులు హాజరయ్యారు. అలాగే గుంటూరులో నిర్వహించిన రిసెప్షన్‌ వేడుకకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి హాజరై.. నూతన దంపతులును ఆశీర్వదించారు. అయితే ఈ వివాహ వేడుకకు పవర్‌స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హాజరుకాకపోవడం అందరిని ఆశ్చర్యపరుస్తోంది. పవన్‌, అలీ ఇద్దరు ఎంత మంచి స్నేహితులో అందరికి తెలుసు. అలాంటిది.. అలీ కుమార్తె వివాహానికి పవన్‌ కళ్యాణ్‌ రాకపోవడంతో.. వారి బంధం గురించి పలు అనుమానాలు, ఊహాగానాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై తాజాగా నటుడు అలీ స్పందించాడు. పవన్‌ కళ్యాణ్‌ రాకపోవడానికి గల కారణాలు వివరించారు.

ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. “నా కుమార్తె పెళ్లికి పవన్ కళ్యాణ్ రావాల్సిందిగా స్వయంగా ఆహ్వానించాను.. వివాహానికి రావాల్సిందిగా శుభలేఖ కూడా ఇచ్చాను. ఆయన కూడా వివాహానికి వస్తాను అని చెప్పారు. ఆయన సెక్యూరిటీ సిబ్బంది వచ్చి రూట్ మ్యాప్ కూడా చూసుకున్నారు అయితే చివరి నిమిషంలో ఫ్లైట్ క్యాన్సిల్ అవడంతో ఆయన ఈ వివాహానికి హాజరు కాలేకపోయారని నాకు ఫోన్ చేసి మరీ చెప్పారు.. అంతేకాక వధూవరులు ఇద్దరు ఇంటిలో ఉన్నప్పుడు చెప్పు.. నేను ఇంటికి వచ్చి కలుస్తాను అన్నారు” అని తెలిపారు అలీ.

Read more RELATED
Recommended to you

Latest news