బ్యాండ్ భాజాతో మోత మోగిస్తున్న ప్రగతి.. వీడియో వైరల్..!

-

ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా ఆమె వరుసగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషిస్తూ అక్క, తల్లి, అత్త, వదిన లాంటి పలు పాత్రల ద్వారా ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. ఇకపోతే సినిమాలలో హోమ్లీ క్యారెక్టర్స్ లో నటించే ప్రగతి బయట మాత్రం ఊర మాస్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా జిమ్ లో ఆమె చేసే రచ్చ అంతా ఇంతా కాదు. భారీ వెయిట్ లిఫ్టింగ్ చేస్తూ కుర్రాళ్ళకి కూడా సవాలు విసురుతూ ఉంటుంది. అలాగే అందాల ఆరబోత అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో పూర్తి స్థాయిలో తన అందాలను ఆరబోస్తూ.. డాన్స్ చేస్తూ మరింత పాపులారిటీని దక్కించుకుంది.

కేవలం సినిమాలలోనే కాదు బయట ఎక్కడైనా భాజా భజంత్రీలు లేదా బ్యాండ్ లాంటివి కనిపించాయి అంటే కచ్చితంగా అక్కడ దర్శనమిస్తూ ఉంటుంది ప్రగతి. బ్యాండ్ వాయిద్యాల మధ్య మాసిస్ స్టెప్పులేస్తూ మరింతగా అలరిస్తూ ఉంటుంది. ఇదిలా ఉండగా తాజాగా ఇప్పుడు కూడా మాస్ గా డాన్స్ తో అదరగొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్ గా మారుతుంది. ఇదిలా ఉండగా తన సోదరి మ్యారేజ్ లో ఆమె ఎంజాయ్ చేసిన విధానం నేటిజన్స్ ను బాగా ఆశ్చర్యానికి గురి చేసింది . ఐదు పదుల వయసు దగ్గర పడుతున్నా ఆమె ఎనర్జీ లెవెల్స్ చూసి ప్రతి ఒక్కరు ఆశ్చర్యపోతున్నారు.

తాజాగా ఒక వ్యక్తి బ్యాండ్ వాయిస్తూ ఉండగా దానిపైన ప్రగతి ఎక్కేసింది . అక్కడితో ఆగకుండా డాన్స్ కూడా చేసింది. అయితే వెనకాల ఆ వ్యక్తి మాత్రం మోయలేక ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా చెల్లెలు పెళ్లి అనడంతో ఆమె కంట్రోల్ లేకుండా ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Pragathi Mahavadi (@pragstrong)

Read more RELATED
Recommended to you

Latest news