పవన్ – బాబు… కేసీఆర్ ను టార్గెట్ చేస్తారా?

-

సరిగ్గా గమనిస్తే నాలుగు రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో.. చాలా విషయాల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అలాంటి నిర్ణయాలే తీసుకున్నారని చెప్పొచ్చు! ఉదాహరణకు మద్యం సంగతే తీసుకుందాం..! రెడ్, ఆరెంజ్, గ్రీన్ జోన్లు అనే తారతమ్యాలు లేకుండా… అన్ని జోన్లలోనూ ఉదయం 10గంటల నుంచి సాయంత్రం ఆరుగంటల వరకూ మద్యం షాపులు తెరిచే ఉంటాయన్నారు కేసీఆర్.. ఈ విషయంలో ఉదయం 11 గంటల నుంచి 7 గంటల వరకూ చేశారు జగన్! మరి ఈ విషయాలపై జాతీయ పార్టీ అయిన తెలుగుదేశం, జనసేన పార్టీలు ఎలా స్పందిస్తాయి అనే విషయంపై అందరికీ ఆసక్తి నెలకొంది!

ఏపీలో కేంద్రం ఆదేశాల మేరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేసిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో… ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అధినేత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలు.. వైఎస్ జగన్ పై ఫైరయ్యారు. ఇంతకాలం తీసుకున్న చర్యలకు విలువ లేకుండా పోయిందని.. మద్యం దుకాణాలు ఎత్తకుండా ఉండాల్సిందని అన్నారు. ఇదే విషయంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా స్పందించారు… మద్యం దుకాణాలు ఓపెన్ చేయడం ఏమాత్రం సరైన చర్య కాదని ఫైరయ్యారు! సరిగ్గా వీరు ఇలా ఫైరయిన రెండు రోజులకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఇదే నిర్ణయం తీసుకున్నారు. దీంతో… ఇప్పుడు చంద్రబాబు – పవన్ కళ్యాణ్ లు ఈ విషయంపై ఎలా స్పందిస్తారు అనే అంశంపై ఆసక్తి నెలకొంది.

టీడీపీ కి తెలంగాణ ప్రజలు కూడా ముఖ్యమే కాబట్టి… మద్యం దుకాణాల విషయంలో జగన్ ను విమర్శించినట్లుగానే కేసీఆర్ ని కూడా విమర్శిస్తారా లేక.. హైదరాబాద్ లో ఇళ్లు అయితే ఉంది కానీ… తెలంగాణతో మనకు సంబందం ఏమిటి అని అనుకుంటారా? అనేది ఆసక్తిగా నెలకొంది. ఇదే క్రమంలో పవన్ కల్యాణ్ కూడా… ఈ విషయంలో కేసీఆర్ ని విమర్శించే సాహసం చేస్తారా లేక సైలంటు గా ఉంటూ స్పందించకుండా ఉంటారా? అనేది వేచి చూడాలి. ఈ విషయంలో పవన్ – బాబు లు తెలంగాణలో మద్యం దుకాణాల రీ ఓపెన్ పై కూడా స్పందిస్తే మాత్రం క్రెడిబిలిటీ పెరిగే అవకాశం ఉందని.. అలా కానిపక్షంలో ఇద్దరికీ తెలంగాణతో సంబందం లేదని, లేదా… కేసీఆర్ అంటే భయమని ప్రజలు అభిప్రాయపడే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news