జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన నాలుగో విడత వారాహి యాత్ర కృష్ణా జిల్లాలో ఐదు రోజుల పాటు కొనసాగనుంది. అవనిగడ్డ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. కురుక్షేత్రం అంటే కురుక్షేత్రమే. మీరు ఓడిపోవడం ఖాయం.. మేము అధికారంలోకి రావడం ఖాయం. మేం వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటాం. మెగా డీఎస్సీ కోరుకుంటున్నవారికి మేం అండగా ఉంటామన్నారు. కురుక్షే త్ర యుద్దంలో తాము పాండవులమని.. వైసీపీ నేతలు కౌరవులమంటూ… మీరు ఓడిపోవడం ఖాయం.. మేము గెలవడం ఖాయమన్నారు.
తనను కదనరంగంనుంచి పారిపొమ్మంటున్నారంటూ కొంతమంది బెదిరిస్తున్నారని జనసేన పవన్ కళ్యాణ్ అన్నారు. స్పెషల్ ప్యాకేజీ విషయంలో గతంలో తాను టీడీపీతో విభేదించానన్నారు.మెగా డీఎస్సీ కోరుకుంటున్నవారికి అండగా ఉంటానంటూ.. 2018 నుంచి టీచర్ పోస్టులను భర్తీ చేయలేదన్నారు. 30 వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటూ… జగన్ పాదయాత్రలో ఇవ్వని హామీ లేదన్నారు. వైసీపీని అధికారంలోనుంచి దించడమే జనసేన లక్ష్యమన్నారు.వైసీపీ పతనం మొదలైందన్న పవన్… జగన్ అద్భుతమైన పాలకుడైతే తాను రోడ్డు మీదకు రావాల్సిన అవసరం లేదన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నిరుద్యోగుల రుణం తీర్చుకుంటానన్నారు. ప్రధాని మోడీకి కూడా జగన్ గురించి తెలుసన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలను గెలిపించాలని కోరారు. బహిరంగ సభ అనంతరం మచిలీపట్నం చేరుకుంటారు. రేపు, ఎల్లుండి వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం కృష్ణా జిల్లా జనసేన నేతలతో పవన్ సమావేశమవుతారు.