తెలంగాణలో పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు… !

-

ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జనసేనాని ఇంకా పార్టీ స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్ళలేదు.. గతంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం జరిగిందే, కాగా జనసేనకు కేవలం ఒక్క సీటు మాత్రమే వచ్చింది. ఇక వచ్చే సంవత్సరం జరగనున్న ఎన్నికలకు సన్నద్ధం అవుతున్న తరుణంలో తెలంగాణలోనూ పోటీ చేస్తున్నామని ప్రకటించి ఆశ్చర్యాన్ని కలిగించాడు. తెలంగాణాలో ఏ నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నామన్న విషయాన్నీ కూడా ఇటీవల ప్రకటించాడు పవన్. కాగా తాజాగా తెలంగాణ లో పొత్తుల గురించి ప్రస్తావించాడు.. ఈ సారి తెలంగాణాలో పోటీ చేయడం కంఫర్మ్.. కానీ పొత్తుల విషయంలో ఇంకా ఎవరితో కలిసి వెళ్లాలన్న విషయంపై క్లారిటీ రాలేదు అంటూ చెప్పాడు.

మరి పవన్ కళ్యాణ్ తెలంగాణాలో పోటీ చేయడం సమంజసమే అని మీరు భావిస్తున్నారా ? అక్కడ కనీసం ఒక్క సీటు అయినా గెలిచే పరిస్థితి ఉందా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news