గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ మాజీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారిపోయిన విషయం తెలిసిందే. హైకోర్టు నుంచి నిమ్మగడ్డను మళ్లీ ఎన్నికల కమిషనర్ గా నియమించాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ జగన్ సర్కార్ ఆ దిశగా అడుగులు వేయలేదు, ఈ విషయమై ఏకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. న్యాయస్థానాలు జగన్ సర్కార్ పై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ జగన్ సర్కారు మాత్రం నిమ్మగడ్డను మళ్లీ ఎన్నికల కమిషనర్గా నియమించేందుకు ససేమిరా అంటోంది.
అయితే తాజాగా నిమ్మగడ్డ వ్యవహారం పై స్పందించిన వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఎన్నికల కమిషనర్ గా కొనసాగించే ఆలోచన జగన్ ప్రభుత్వానికి లేదని… ప్రస్తుత రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఉన్న జస్టిస్ కనకరాజుతో సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించే ఆలోచనలో జగన్ సర్కార్ ఉంది అంటూ వ్యాఖ్యానించారు. ఇది సరైన పద్ధతి కాదని రాజ్యాంగ సంస్థలను గౌరవించాలని హితవు పలికారు.