PSPK26 పసుపు రాజకీయం.. ఇది సినిమా .. అది రాయకీయం పోలికేంటి..?

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత చాలా కాలం రాజకీయలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అంతేకాదు జనసేన పెట్టిన తర్వాత ఇక నేను సినిమాలు మానేస్తున్నాను. ప్రజలకి సేవ చేయడమే లక్ష్యం అని తేల్చి చెప్పారు. అయితే ఇది మెగా ఫ్యాన్స్ కి పవర్ స్టార్ ఫ్యాన్స్ కి అంతగా మింగుడు పడలేదు. దాంతో ఆయన రాజకీయాలలో బిజీగా ఉన్నా కాని సినిమాలు మాత్రం అసలు మానకూడదని మళ్ళీ సినిమాలు చేయాల్సిందేనని పట్టు పట్టారు. ఆ ప్రభావమా లేదా రాజకీయాలలో పవన్ కల్యాణ్ అంతగా సక్సస్ కాలేకపోవడమా అనేది పక్కన పెడితే అనూహ్యంగా మొహానికి మేకప్ వేసుకొని బాలీవుడ్ పింక్ సినిమా రీమేక్ లో నటించడానికి రెడీ అయిపోయారు.

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ నటించిన పింక్ సూపర్ హిట్టయిన సంగతి తెలిసిందే. అదే సినిమాని తమిళంలోను అజిత్ హీరోగా తెరకెక్కించి సక్సస్ ని అందుకున్నారు. ఈ రెండు వెర్షన్ కి బాలీవుడ్ నిర్మాత బోని కపూర్ నిర్మించారు. దాంతో ఈ సినిమాని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తెలుగులో నిర్మించాలని డిసైడయ్యారు. అందుకే ఈ సినిమాకోసం పవన్ కళ్యాణ్ ని ఒప్పించి ఈ సినిమాని ఆయనతో నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాకి బోనీ కపూర్ కూడా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

నేపథ్యంలోనే తాజాగా పవన్ కల్యాణ్ సినిమా ఫస్ట్ లుక్ ఈ రోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ అంటూ సాంపిల్ పోస్టర్ ని రిలీజ్ చేశారు చిత్ర బృందం. అయితే ఈ పోస్టర్ లో ఎల్లో కలర్ హైలెట్ కావడం… పసుపు పచ్చ బ్యాక్ గ్రౌండ్ మీద బ్లాక్ లెటర్స్ తో పి.ఎస్.పి.కె 26 వివరాలు ఉండటం కొంతమందికి కామెంట్స్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది. ఇన్‌డైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ టి.డి.పి కి సపోర్ట్ అన్నదానికి ఇదే ఉదాహరణ అంటూ యాంటీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో పవన్ లాయర్ గా నటిస్తున్నారు కాబట్టి నల్లకోటుకి సింబాలిక్ గా బ్లాక్ లెటర్స్ ని పెట్టారు. అయితే ఆ లెటర్స్ హైలెట్ అవ్వాలంటే వేరే ఏ కలర్స్ అయినా వాడవచ్చు. కానీ ఎల్లో కలర్ నే సెలెక్ట్ చేసుకున్నారంటే ఆయన చంద్రబాబుకి సపోర్ట్ అనే కదా అంటూ మాట్లాడుకుంటున్నారట. అయితే ఈ కామెంట్స్ పవన్ కళ్యాణ్ విని, చూసి సైలెంట్ గా ఉంటారేమో గాని ఆయన ఫ్యాన్స్ మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు కదా .. అందుకే తిరిగి రివర్స్ లో కౌంటర్ ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్. రాజకీయానికి సినిమా పోస్టర్ కి లింక్ పెడుతూ కామెంట్స్ చేస్తుంటేనే మీ నాలెడ్జ్ ఏంటో అర్థమైందని ఆయన సైలెంట్ గా తన పనేదో తను చేసుకుంటూ వెళుతుంటే ఒక్క పొస్టర్ చూసి ఇలా అనవసరమైన కామెంట్స్ చేయడం మేము సహించం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ బదులు ఆయన ఫ్యాన్సే కౌంటర్ వేస్తున్నారు. ఏదేమైనా పవన్ కళ్యాణ్ సినిమా కి ఇది పబ్లిసిటీగా బాగా ఉపయోగ పడుతోంది. ఇక మరి కాసేపట్లో రిలీజ్ కాబోతున్న పవన్ కళ్యాణ్ తాజా చిత టైటిల్ పోస్టర్ కోసం ప్రేక్షకులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news