ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర సీఎం జగన్ కు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. “భీమ్లా నాయక్” ను ఏపీలో ఎవరూ ఆపలేరని జగన్ సర్కార్ ను హెచ్చరించారు పవన్ కళ్యాణ్ ఏపీ ఫ్యాన్స్. విజయవాడ పట్టణంలోని అలంకార్, శైలజా థియేటర్ల వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇవాళ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ఐదో షోకు అనుమతివ్వాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ జగన్ సర్కార్ ను డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాట్లాడుతూ.. పవన్ కళ్యాణ్ అంటే సీఎం జగనకు ఒణుకు పుడుతోందని చురకలు అంటించారు. పక్క రాష్ట్రంలో బెనిఫిట్ షోలకు అనుమతిస్తోంటే.. ఇక్కడెందుకు అనుమతివ్వడం లేదని పవన్ ఫ్యాన్స్ ఆగ్రహించారు.
రేపు పవన్ అలజడి సృష్టిస్తారని.. పవన్ సినిమాని ఆపేందుకు ప్రభుత్వం సిల్లీ జీవోలిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో వకీల్ సాబ్ సినిమాను అడ్డుకునే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. సీఎం జగన్, మంత్రి పేర్ని నాని పవన్ విషయంలో కక్ష పూరితంగా వ్యవహరిస్తోందని నిప్పులు చెరిగారు పవన్ ఫ్యాన్స్.