లోకేశ్ కు పవన్ దెబ్బ మామూలుగా లేదుగా..?

-

నారా లోకేశ్.. తెలుగుదేశం పార్టీలో నెంబర్ టూ.. చంద్రబాబు తర్వాత తెలుగుదేశం పార్టీని నడిపించాల్సినవాడు.. టీడీపీ అధినేత చంద్రబాబు లోకేశ్ నాయకత్వంపైనే ఇన్నాళ్లూ ఆశలు పెట్టుకున్నారు. కానీ మొన్నటి ఎన్నికల్లో నారా లోకేశ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడనే చెప్పుకోవాలి. పార్టీని గెలిపించడం సంగతి అలా ఉంచి స్వయంగా తాను కూడా ఓడిపోయాడు.

నిప్పురవ్వలాంటి జగన్ సీఎం అయ్యాడు. కాకపోతే.. ఐదేళ్లకు కాకపోతే..పదేళ్లకైనా జగన్ పీఠం దిగితే ప్రత్యామ్నాయంగా తెలుగుదేశమే ఉంటుంది. అప్పుడైనా లోకేశ్ కు అవకాశం రాకపోతుందా అన్నది తెలుగుదేశం అభిమానుల మాట. కానీ మధ్యలో పవన్ కల్యాణ్ ఎంటరైపోయాడు.

అయితే పవన్ కళ్యాణ్ కూడా మొన్నటి ఎన్నికల్లో అట్టర్ ఫ్లాప్ అయ్యుండొచ్చు. కానీ లోకేశ్ తో పోలిస్తే.. పవన్ కల్యాణ్ కు సొంత ఫ్యాన్స్ బలం ఉంది. కోట్ల రూపాయల సినిమాలు వదులుకుని జనం కోసం వచ్చాడన్న పాజిటివ్ ఇంప్రెషన్ కూడా పవన్ పై ఉంది. అలాంటి పవన్ ఎన్నికలైపోయిన కొద్దిరోజుల్లోనే రాజకీయాల్లో యాక్టివ్ అయ్యాడు.

ఇసుక సమస్య పేరుతో అందివచ్చిన అవకాశాన్ని పవన్ ఉపయోగించుకునేందుకు విశాఖలో నవంబర్ 3న ర్యాలీకి ప్లాన్ చేశాడు. దీంతో నారా లోకేశ్ కు ఉనికి చాటుకోవాల్సిన అవసరం అర్జంటుగా వచ్చేసింది. అందుకే ఎన్నికల తర్వాత ట్వీట్లకే పరిమితమైన లోకేశ్ ఇప్పుడు జనంలోకి వస్తున్నాడు.

మొన్నటికి మొన్న ఇసుక సమస్యపై ఒకరోజు దీక్ష చేశాడు. తాజాగా చింతమనేని ప్రభాకర్ ఫ్యామిలీని పరామర్శించేందుకు పశ్చిమగోదావరి జిల్లాకు వెళ్లాడు. మొత్తానికి పవన్ దెబ్బకు నారా లోకేశ్ జనంలోకి రాకతప్పడం లేదన్నమాట.

Read more RELATED
Recommended to you

Latest news