బిగ్ బాస్ ఫైనల్లో డ్యాన్సులతో అదరగొట్టనున్న ముగ్గురు హీరోయిన్లు వీళ్లేనా..

-

బుల్లితెర బిగ్గెస్ట్ ఎంటర్టైనింగ్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ చివరి అంకంకు చేరుకుంది. నవంబర్ 3న ఈ రియాల్టీ షో ముగుస్తోంది. ఫైనల్స్ బరిలో ఐదుగురు కంటెస్టెంట్లు ఉన్నారు. మరోవైపు, ఫైనల్స్ ను గ్రాండ్ గా జరిపేందుకు ఈ షో యాజమాన్యం ఏర్పాట్లు చేస్తోంది. మెగాస్టార్ చిరంజీవి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు.

అంతేకాదు, హీరోయిన్లు నిధి అగర్వాల్, క్యాథరిన్, అంజలి ఈ కార్యక్రమంలో డ్యాన్స్ లతో అలరించనున్నట్టు సమాచారం. కంటెస్టెంట్లలో రాహుల్ ప్రస్తుంతం టాప్ లో కొనసాగుతున్నాడు. అతనే విజేతగా నిలిచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు గ్రాండ్ ఫినాలే ప్రారంభంకానుంది.

Read more RELATED
Recommended to you

Latest news