ఏపీలో రాజకీయం వేడెక్కింది. ఓవైపు బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీ లో పర్యటిస్తున్న నేపథ్యంలో బీజేపీ- జనసేన పొత్తుల నుంచి సీఎం అభ్యర్థిగా జనసేనాని పవన్ కళ్యాణ్ పేరును ప్రకటించాలని జనసైనికులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆత్మకూరు ఉప ఎన్నికలు కూడా జరుగుతున్న నేపథ్యంలో అక్కడ టిడిపి పోటీ చేయడం లేదు కానీ బిజెపి పోటీకి సిద్ధమైంది.అయితే నెల్లూరు జిల్లాలో తాజాగా మంత్రి రోజా మాట్లాడుతూ.. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తామని ఆమె ధీమా వ్యక్తం చేశారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు, గౌతమ్ రెడ్డి చేసిన అభివృద్ధి పై ఓట్లు అడుగుతాం అని ఆమె వెల్లడించారు. బీజేపీ పోటీ నామమాత్రమే అన్న రోజా.. పవన్ కళ్యాణ్ కు మూడు ఆప్షన్లు లేవు.. ఓకే ఆప్షన్.. ఓడిపోవడమే అంటూ ఆమె వ్యాఖ్యానించారు. గత ఎన్నికల్లో రెండు చోట్లా ఓడిపోయారని, టీడీపీకి ఇంకా 50 స్థానాల్లో సరైన అభ్యర్థులు లేరని లోకేష్ చెప్పాడని, ఇలాంటి పార్టీలు ఎలా వైసీపీకి పోటీ ఇస్తాయి అంటూ సెటైర్లు వేశారు మంత్రి రోజా.