పార్టీ ఫండ్ రైజింగ్ కోసం జనసేనాని కొత్త వ్యూహం…!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు.ఓ వైపు చేతిలో మూడు సినిమాలు పెట్టుకుని మరో ప్రాజెక్ట్ కు కాల్షీట్స్ ఎడ్జెస్ట్ చేస్తున్నాడు.ఎప్పుడూ లేనిది పవన్ ఇన్నేసి ప్రాజెక్ట్ లతో ఎందుకు మన ముందుకు రావాలని చూస్తున్నాడంటారు. పవన్ ఈ మధ్య బౌండెడ్ స్క్రిప్ట్ తో ఎవరు తన దగ్గరకు వచ్చి కథ వినిపిస్తే వారికి డేట్స్ ఎడ్జెస్ట్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది.మంచి కథతో వస్తే చాలు…మెగా ఫోన్ పట్టుకోవడానికి రేంజ్ ఉండాల్సిన అవసరం లేదంటున్నాడు.దీని వెనుక ఓ పెద్ద సీక్రేట్ ఉందంటున్నారు.


పింక్ రీమేక్ వకీల్ సాబ్ ,క్రిష్ పీరియాడిక్ ఫిలింతో పాటు సాగర్ చంద్ర డైరెక్షన్లో రూపొందే సినిమా కథ కూడా పవన్ కు ఎంతగానో నచ్చిందట.అందుకే కాబోలు హరీష్ శంకర్ బడా దర్శకుడు కాకపోయినప్పటికీ పవన్ కు నచ్చే కథతో కన్విన్స్ చేసి కమిట్ మెంట్ తెచ్చుకున్నాడని చెబుతున్నారు.తాజాగా ఈసినిమాకు అప్పుడే షూటింగ్ డేట్స్ కూడా ఇచ్చేసారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కే ఈ సినిమాను.. మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కిస్తున్నారు.అయితే పవన్ ఇన్నేసి సినిమాలను ఒక్కసారిగా ఎందుకు కమిట్ అవుతున్నాడంటూ కొందరు కొశ్చన్ చేస్తున్నారు.వెంటవెంటనే సినిమాలకు ఓకే చెబితే క్వాలిటీ తగ్గిపోతుందనే భయాన్ని ఫ్యాన్స్ వ్యక్తం చేస్తున్నారు.

ఇక్కడ ఫ్యాన్స్ అనేవారు పవన్ చేసే సినిమాల క్వాలిటీ గురించి మాట్లాడుతున్నారు గాని ..అతను నడిపిస్తున్న పార్టీ కోసం ఇలా వరుస సినిమాలు చేసి ఫండ్ రైజ్ చేస్తున్నాడనే విషయాన్ని మాత్రం మర్చిపోతున్నారు. సో పవన్ ఇప్పుడు ఇంకా ఎన్ని ప్రాజెక్ట్ లకు కమిట్ అయినా…అదంతా తన పార్టీని ఆర్ధికంగా ఆదుకోవడానికే అనేవిషయాన్ని గుర్తించాల్సి ఉంటుంది.వన్స్ ఎలక్షన్స్ సమీపించాక పవన్ సినిమా చేయమన్నా చేయడు.సో ఏం చేసినా ఎన్ని చేసినా ఈ రెండు మూడేళ్లే అనే విషయాన్ని మనం గుర్తు పెట్టుకోవాలి.