చెన్నై లో భారీ వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పాటూ వరదలు కూడా పోటెత్తుతున్నాయి. ఇక వరదల నేపథ్యంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక వరదల నేపథ్యంలో చెన్నై లోని టీపీ ప్రాంతంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు. కాగా అతడిని చూసిన ఎస్సై రాజేశ్వరి తన భుజాన ఎత్తుకుని ఆటోలో ఎక్కించి ఆస్పత్రికి తీసుకువెళ్లారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.

కాగా ఈ వీడియో చూసిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఎస్సై రాజేశ్వరిని ప్రశంసించారు. చెన్నై వరదల సమయంలో తమిళనాడు పోలీసు అధికారిణి ‘Ms. రాజేశ్వరి సేవలు ప్రశంసనీయం అంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఆమె స్ఫూర్తిదాయకమైన సేవలకు జనసేన తరఫున అభినందనలు తెలియజేస్తున్నామని పవన్ పేర్కొన్నారు. అంతే కాకుండా పద్మ అవార్డు గ్రహీత అయిన యడ్ల గోపాలరావు కి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.