వైసీపీ ప్రభుత్వానికి రెండు వారాలు గడువిస్తున్నాం : పవన్ కళ్యాణ్

-

– భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
– లేదంటే అమరావతి వీధుల్లో నడుస్తా..
– కార్మికుల కోసం ఢిల్లీ వెళ్లి మోడీతో మాట్లాడతాను.
— వైసీపీ ఫ్యాక్టన్ రాజకీయాలకు భయపడను.
– కుల రాజకీయాల పట్ల సిగ్గు పడాలి
– చర్యకు ప్రతి చర్య తప్పదు
-లాంగ్ మార్చ్ లో జనసేనా అధినేత పవన్ కల్యాణ్
– వైసీపీ కి భారీ హెచ్చరికలు

విశాఖపట్నంలో జనసేనా పార్టీ లాంగ్ మార్చ్ కు అనూహ్య స్పందన వచ్చింది. భవన నిర్మాణ కార్మికులకు అండగా పార్టీ అధినేత పవన్ కాల్యాణ్ పిలుపు మేరకు జనం తరలి వచ్చారు. ఈ సందర్భంగా హోరాహోరీగా ఉపన్యసించారు. కార్మికుల సమస్యలపై రెండు వారాల్లో ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. లేదంటే అమరావతి వీధులో తిరగుబాటు చేస్తానని చెప్పారు. అనేక కోణాల్లో వైసీపీ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. వైసీపీ చేస్తున్న ఫ్యాక్షన్ రాజకీయాల గురించి భయపడనని చెప్పారు. ఆ పార్టీ నాయకులను సభాముఖంగా ఏకిపారశారు. వైస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా మంచి పాలన అందిస్తే వెళ్లి సినిమాలు చేసుకుంటానని అన్నారు. కోట్ల రూపాయను కాదని తను జనం కోసం వచ్చినట్టు చెప్పారు. తన కోపం, తన ఆత్మగౌరవం గురించి వైసీపీకి తెలుసా అని ప్రశ్నించారు. భవన నిర్మాణ కార్మికుల మరణాల పట్ల ఆవేదన చెందారు. తనకు కష్టపడే వారి శ్రమ తనకు తెలుసన్నారు. భవన నిర్మాణ కార్మికుల కష్టాలు తెలుసని చెప్పారు. ‘మీ బతుకులు మాకు తెలియవా? ఎక్కడి నుంచి వచ్చారో తెలియదా’ అని వైసీపీ నాయకులను ఉద్ధేశించి అన్నారు. భీమవరంలో, గాజువాకలో ఓడిపోయినా తమను బాధలేదన్నారు. ఓటమీ గెలుపులు కాదనీ పోరాటం ముఖ్యమన్నారు. అందుకే ప్రతి సందర్భంలో పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు. శ్రామికుల పట్ల పోరాడతానని అన్నారు.

జీవితాలు ఆగిపోతాయి.
భవన నిర్మాణ కార్మికులే లేకపోతే జీవిత రథచక్రాలు ఆగిపోతాయి. వాళ్లను కాపాడుకోలేక పోతే మన బతుకులు ఆగిపోతాయి. ఆ కార్మికులు తన దగ్గరకు వచ్చి కనీస పని ఇప్పించాలని కోరినట్టు తెలిపారు. ఇసుకను తాత్కాలికంగా ఆపడం దారుణమని అన్నారు. ఇంత మంది అధికారులున్నా పర్యావసనాలను అంచనా వేయలేదంటే వైసీపీలో ప్రజాస్వామ్యం లేదని భావిస్తున్నట్టు చెప్పారు. ఆ పార్టీలో ఏకస్వామ్యం నడుస్తుందని చెప్పారు. వరదలు, వర్షాల కారణం ఇసుక ఆపేయడం ఏంటి అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ ఇసుక పాలసీలో తప్పులుంటే సరిచేయాలి కానీ ఇసుకనే ఆపడం సరికాదన్నారు. మెజార్టీ సాధించిన ఆ పార్టీ ప్రజలను సరైన దిశగా పాలించాలని చెప్పారు. నిర్మాణ రంగ కార్మికుల మరణాల పట్ల ఆవేదన చెందారు.

పదవులంటే పట్టింపు లేదు..
పదవులు వస్తాయో లేదో తనకు తెలియదనీ, తనను గుర్తుపెట్టుకొని వస్తే తన వంతు సాయం చేస్తానని అన్నారు. పదవులతో తనకు సంబంధం లేదన్నారు. జనసేనా పార్టీ అంటే మనిషి వెంట నిలబడానికి మరో తరానికి తెలపడానికి జనసన పార్టీ ఉందన్నారు.

వైసీపీ నాయకులకు ప్రాణాలంటే ప్రీతి..
జగన్ మీద తనకు ఎలాంటి ద్వేషం లేదనీ, జగన్ గొప్ప నాయకుడు అయితే సంతోషించేది తనే అని చెప్పారు. దేశప్రయోజనాల కోసం ప్రాణాలైనా ఇస్తానని అన్నారు. అలాంటి పని వైసీపీ నాయకులు చేయగలరా అని ప్రశ్నించారు. తనకు ప్రాణాల మీద పట్టింపు లేదన్నారు. అందుకే పోరాడుతున్నా అని చెప్పారు. ప్రాజా సమస్యల మీద పోరాడుతున్నప్పుడు వివిద పార్టీలు ఎలా సహకారం చేసుకోవాలి, ఎలా మద్ధతు ఇవ్వాలో తెలిసుండాలని చెప్పారు. తను ప్రజలకు దత్తపుత్రుడునని, కష్టాలకుదత్తపుత్రుడని పవన్ కల్యాణ్ అన్నారు. తనను టీడీపీ దత్తపుత్రుడని అంటున్న వైసీపీ నాయకులకు ఇదే తన జవాబని చెప్పారు.

ఫ్యాక్షన్ రాజకీయలకు భయపడను
జీవితంలో తను చాలా చూసి వచ్చాననీ, ఫ్యాక్షన్ రాజకీయలకు భయపడనని అన్నారు. వైసీపీ నాయకులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఎక్కువ మాట్లాడుతున్నారని చెప్పారు. సూటికేస్ కంపెనీలు పెట్టే విజయసాయిరెడ్డి కూడా తనను విమర్శించడం హస్యాస్పదనం అన్నారు. ఇలాంటి పార్టీల సభ్యులు ఎంపీలు అవ్వడం దురద్రుష్టం అన్నారు. టీడీపీ తో తన సంబంధాల గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులను హెచ్చరించారు. ఎన్నికలకు ముందు తనను కలిసిన వైసీపీ నాయకులు ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు కాగానే కండ్లు నెత్తికెక్కినట్టు మాట్లాడుతున్నారా అని విరుచుకుపడ్డారు..

భవన నిర్మాణ కార్మికుల గురించి వైసీపీకి రెండు వారాల గురించి సమయం ఇస్తున్నట్టు చెప్పారు. ఈ సమయంలో కార్మికులందరికీ తలా 50 వేలు ఇవ్వాలనీ, చనిపోయిన కార్మికుల కుటుంబాలకు 5 లక్షల నష్టపరిహారం చెల్లించాలన్నారు. లేదంటే అమరావతి వీధుల్లో నడుస్తాం అని హెచ్చరికలు జారీ చేశారు. అవసరమైతే ఢిల్లీ వెళ్లి మోడీతో మాట్లాడతానన్నారు. అనంతరం ఉపన్యాసం ముగింపులో మృతి చెందిన కార్మికుల ఆత్మకు శాంతి కలగాలని సభాముఖంగా మౌనం పాటించారు..

Read more RELATED
Recommended to you

Latest news