పవన్ కళ్యాణ్ ని ఢీ కొట్టడానికి భళ్లాల దేవ వచ్చేస్తున్నాడు..

-

వకీల్ సాబ్ సినిమాతో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న పవన్ కళ్యాణ్, తన లైనప్ లో నాలుగు సినిమాలు పెట్టుకున్నాడు. అందులో ఒకటి సితార ఎంటర్ టైన్మెంట్ బ్యానర్లో రూపొందుతుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుందని దసరా రోజునే ప్రకటించారు. ఐతే ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు మరో హీరో ఉంటాడట. పవన్ కళ్యణ్ తో తెర పంచుకునే ఆ హీరో ఎవరనే విషయమై అనేక వార్తలు వచ్చాయి. భళ్లాల దేవ రానా దగ్గుబాటి నటిస్తున్నాడని అన్నారు.

ఆ తర్వాత కన్నడ హీరో, మళయాలం హీరో.. పవన్ కళ్యాణ్ పక్కన చేస్తాడని చెప్పారు. కానీ తాజా సమచారం ప్రకారం ఇంకా పేరు పెట్టని ఆ సినిమాలో పవన్ ని ఢీ కొట్టేది భళ్లాల దేవ రానా దగ్గుబాటి అని వినిపిస్తుంది. ఈ మేరకు రేపు లాంచింగ్ జరగనుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి.. వీరిద్దరూ ఒకే సినిమాలో నటిస్తున్నారంటే ఆ హైప్ మామూలుగా ఉండదు. ఐతే అధికారిక ప్రకటన రాలేదు కాబట్టి అభిమానుల సందడి ఇంకా మొదలు కాలేదు. దానికోసం రేపటి లాంచింగ్ కార్యక్రమంలో పూర్తి వివరాలు వెల్లడి చేసేదాకా ఆగాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news