మీ వయసు యాభైకి దగ్గర పడుతుందా..? ఐతే ఈ చర్మ సంరక్షణ చర్యలు తెలుసుకోండి..

-

వయసు మీద పడుతున్న కొద్దీ చర్మ ముడుతలు పడటం సహజం. వయసు పెరుగుతుంటే చర్మం దాని పట్టు కోల్పోతుంది. ఐతే కొన్ని ఆహారపు అలవాట్లు, అలాగే చర్మ సంరక్షణ చర్యలు పాటిస్తే యాభైకి చేరువైనా చర్మం దాని పట్టు కోల్పోకుండా ఉంటుంది. దానికోసం ఏం చేయాలో ఇక్కడ చూద్దాం.

సన్ స్క్రీన్ లోషన్..

బయటకి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేసుకోవాలి. చర్మాన్ని పాడు చేసేది ఏదైనా ఉందంటే అవి సూర్యకిరణాలే. అందులో ఉండే అతినీల లోహిత కిరణాలు చర్మంపై డైరెక్టుగా పడటం వల్ల ముడుతలు, పొడిబారిపోవడం, చర్మ క్యాన్సర్లు చాలా తొందరగా వచ్చేస్తాయి. అందుకే చర్మాన్ని సూర్యుడి నుండి కాపాడుకోవడం కంపల్సరీ.

మాయిశ్చరైజర్ ఎలాంటిది వాడుతున్నారో చెక్ చేసుకోండి.

వయసులో వాడిన మాయిశ్చరైజర్ ఇప్పుడు కూడా వాడాలని చూడకండి. అప్పుడు చర్మం ఒకలా ఉంటుంది. వయసు మీద పడ్డాక మరోలా మారుతుంది. అందుకే మీకేదీ సూట్ అవుతుందో చెక్ చేసుకోండి.

కళ్ళ కింద చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి.

వయసు మీద పడిందని కళ్ళ కింద చర్మం చూస్తే ఈజీగా గుర్తుపట్టేయవచ్చు. అందుకే కళ్ళ కింద చర్మాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. దాని కొరకు ప్రత్యేకంగా ఐక్రీమ్ వాడాలి.

ఇవే కాకుండా ఫిల్లర్స్, బోటాక్స్ వంటివి వాడటం వల్ల చర్మం సురక్షితంగా ఉండి, వయసు పెరుగుతున్న కనబడనీయకుండా చేస్తుంది. ఇవేగాక మనం తీసుకునే ఆహారం కూడా ఆరోగ్యకరమైనదై ఉండాలి. కూరగాయలు తినడం వల్ల చర్మం సురక్షితంగా ఉంటుంది. అందుకే వయసు పెరుగుతుంటే వెజ్ ప్రిఫర్ చేయడం మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news