విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి – పవన్ కళ్యాణ్

-

విశాఖ ఉక్కు కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని పవన్ కళ్యాణ్‌ ట్వీట్‌ చేశారు. విశాఖ ఉక్కు అనేది తెలుగువారి భావోద్వేగాలతో ముడిపడిన పరిశ్రమ. 32 మంది ప్రాణ త్యాగాలతో… ప్రాంతాలకు అతీతంగా సాగిన ఉద్యమాల ఫలితంగా సిద్ధించినదే విశాఖ ఉక్కు పరిశ్రమ. ఇంతటి ఘన నేపథ్యం ఉన్న విశాఖ స్టీల్ ప్లాంట్ ఎప్పుడూ కేంద్ర ప్రభుత్వ యాజమాన్యంలోనే ఉండాలన్నది జనసేన పార్టీ ఆకాంక్ష అన్నారు జనసేనాని.

ఈ పరిశ్రమ ప్రయివేటీకరణ అంశం ప్రకటన వచ్చినప్పుడు స్పందించి ఢిల్లీ వెళ్ళి బీజేపీ అగ్రనాయకత్వాన్ని కలిసినప్పుడు వారు సానుకూలంగానే స్పందించారు. ఆ స్పందన ఎంతో ఆశావాహంగా కనిపించిది. కేంద్ర హోమ్ శాఖ మంత్రి శ్రీ అమిత్ షా గారిని కలిసి విశాఖ ఉక్కుతో తెలుగు ప్రజలకున్న భావోద్వేగ బంధాన్ని తెలియచేసి ఈ పరిశ్రమను ప్రత్యేకంగా చూడాలని కోరాం. ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీ ఫగన్ సింగ్ కులస్తే గారు ‘విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలనుకోవడం లేదు. దీనిపై ప్రస్తుతానికి ముందుకెళ్లడం లేదు’ అని చేసిన ప్రకటన హర్షణీయం అంటూ పోస్ట్‌ చేశారు పవన్‌ కళ్యాణ్‌.

 

Read more RELATED
Recommended to you

Latest news