మహేశ్ బాబు.. చాలా రిజర్వ్‌డ్ పర్సన్. ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటారు. ఎంత మాట్లాడాలో అంతే మాట్లాడుతారు. పక్కా ఫ్యామిలీ పర్సన్. అయితే.. ఆయన కూతురు మాత్రం ఆయనలా రిజర్వ్‌డ్ కాదండోయ్. ఆయన కూతురు సితార తెలుసు కదా మీకు. అప్పుడప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లలో మహేశ్ బాబు షేర్ చేస్తుంటాడు. తాజాగా తన కూతురు మాట్లాడిన ఓ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేశాడు మహేశ్.
ఆ వీడియోలో సితార.. తన అన్న గౌతమ్ గురించి చెబుతుంది. ఇంగ్లీష్‌లో మాట్లాడుతూ.. తన అన్న ఫ్యామిలీ గాయ్ అంటూ.. ఒక్కడే ఎక్కడికి వెళ్లడని.. ముద్దు ముద్దుగా ఇంగ్లీష్‌లో మాట్లాడిన సితార వీడియోను చేసి నెటిజన్లు షాక్ అయ్యారు. ఎంత ముద్దుగా ఇంగ్లీష్‌లో మాట్లాడావు తల్లీ అంటూ సితారను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. తండ్రికి తగ్గ తనయ అంటూ కామెంట్లు పెడుతున్నారు. దీంతో ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.