మరోసారి హాట్‌ కామెంట్స్‌ చేసిన పవన్‌

-

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వారాహి యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా నరసాపురం అంబేద్కర్ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. సీఎం జగన్ బటన్ నొక్కి డబ్బులు వేయడాన్ని సభలో ప్రస్తావించారు. ఇప్పటి వరకూ బటన్ నొక్కి సంబరం చేసుకున్నారని, సీఎం జగన్ నొక్కని బటన్లను చెబుతానంటూ పవన్ వ్యాఖ్యానించారు.

పూర్తికాని పోలవరం ప్రాజెక్టు బటన్
ఇంకా రాని ఉద్యోగాల నోటిఫికేషన్ బటన్
నష్టపోయిన రైతుల పరిహారం బటన్
ఇల్లు కోల్పోయి దీనస్థితిలో ఉన్న మత్స్యకారుల బటన్
మద్దతు రాని కొబ్బరిసాగు బటన్
దగ్ధమవుతున్న దేవాలయాలు, అంతర్వేది రథం బటన్
ఇప్పటికీ పూర్తి కాని బ్రిడ్జి బటన్
దళితులను చంపి బయట తిరుగుతున్న ఎమ్మెల్సీ బటన్
ఆక్వారైతుకు రూ.1.5కి యూనిట్ విద్యుత్ ఇవ్వని బటన్
అభివృద్ధికి నోచుకోని ఆంధ్రప్రదేశ్ బటన్
మూతపడిన 8 వేల పాఠశాలల బటన్
కొత్త కాలువలు కాదు కదా, కనీసం ఉన్న కాలువల పూడిక తీయలేకపోయిన బటన్
ఆరోగ్యశ్రీ అందక కోల్పోయిన ప్రాణాల బటన్
తాగునీరు దొరకని గ్రామాల బటన్
స్వయం ఉపాధి కల్పించలేని బటన్
అప్పుల్లోకి తోసేసిన ఆంధ్రప్రదేశ్ బటన్
నిలిచిపోయిన అంబేద్కర్ విదేశీ విద్యాదీవెన బటన్
నిరుద్యోగ యువత ఉపాధి బటన్
ఆడబిడ్డల మాన ప్రాణాల బటన్…
…ఈ బటన్లు ఎప్పుడు నొక్కుతారు? అంటూ పవన్ కల్యాణ్ సీఎం జగన్ ప్రశ్నించారు. కానీ జనసేన వస్తే బటన్ నొక్కనని, ప్రజల కోసం ఓ ముఠామేస్త్రీలా పనిచేస్తానని తెలిపారు. ఒక రెల్లి కార్మికుడు చెత్తను తొలగిస్తే, తాను రాజకీయాల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించే పనిచేస్తానని వెల్లడించారు.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version