విద్యార్థుల ప్రాణాలు కూడా విలువైనవే.. జగన్ సర్కార్ పై పవన్ కౌంటర్..!

-

దేశంలోని చాలా రాష్ట్రాలు పదవ తరగతి పరీక్షలను ఎత్తేసి, విద్యార్థులను నేరుగా పై తరగుతలకి అనుమతించిన సంగతి అందరికీ తెలుసు. కానీ, ఏపీలో మాత్రం ఇలా చేయకుండా పదవ తరగతి పరీక్షలు పెడతాం అని ఇప్పటికే ప్రకటించారు. అయితే దీనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభుత్వాన్ని నిలదీశారు. పరీక్షల పేరుతో పిల్లల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దని వారిని కోరారు. అయితే ప్రస్తుతం కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉందన్న నెపంతో వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను రెండ్రోజులకు కుదించింది. ఇదే అవకాశంగా తీసుకొని పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వంపై ట్విట్టర్ వేదికగా రెచ్చిపోయారు.

కరోనా సాకుతో వైసీపీ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాలను రెండ్రోజులకు కుదించిందని, కానీ, అదే సర్కారు పదో తరగతి పరీక్షలకు ఎలాంటి ఆటంకం లేదని ప్రకటించిందని తెలిపారు. ఈ ప్రభుత్వం ఎంతో తెలివైనదని ట్వీట్ చేశారు. టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఓటు హక్కు ఉండదన్న విషయం తెలుసు కాబట్టే కరోనా రోజుల్లోనూ పరీక్షలు నిర్వహించాలన్న నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. అంతేకాదు, ‘పదో తరగతి విద్యార్థుల ప్రాణాలు కూడా విలువైనవే’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టారు. జూలైలో పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు ఏపీ సర్కారు సన్నద్ధమవుతున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news