మోదీ సూచన.. మాస్క్ తప్పనిసరి..!

-

కరోనా మహమ్మారి నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై మే 11న చివరిసారిగా ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే, ప్రస్తుతం దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు సంఖ్య వేగంగా పెరగడంతో మహమ్మారి కట్టడికి తీసుకుంటున్న చర్యలపై ముఖ్యమంత్రులతో చర్చించేందుకు రెండు రోజుల పాటు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. ఈ నేపధ్యంలో మంగళవారం నాడు తొలి విడత వీడియో కాన్ఫరెన్స్‌లో పలువురు సీఎంల అభిప్రాయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించడం తప్పనిసరిగా ధరించాలని, మాస్క్ లేకుండా అస్సలు బయటకు వెళ్లకూడదని సూచించారు. దీనివల్ల మనకు, పక్కవారికి మంచిదన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటిస్తే కరోనా వల్ల నష్టం తక్కువ అని స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news