సింప్లిసిటీకి మీనింగ్ ఇదే ..పవన్ వీడియో వైరల్..

-

సింప్లిసిటీకి కెరాఫ్ పవన్ కల్యాణ్ అన్న విషయం తెలిసిందే..స్టార్ హీరోగా ఉన్నా కూడా ఏ మాత్రం పొగరు చూపించరు..తాను ఏం చెయ్యాలనుకుంటే అది చేసి చూపిస్తాడు..అందుకే ఆయనకు అభిమానులు బ్రహ్మరథం పడతారు..నువ్వు మా హీరోవి కాదు..మా దేవుడివి అంటూ ఫ్యాన్స్ జేజేలు పలుకుతున్నారు..పవన్ ఎక్కడికి వెళ్లినా.. ఫ్యాన్స్ ఆయన్ను చూసేందుకు, షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు, ఓ ఫోటో దిగేందుకు ఆరాటపడతారు. ఒక్క సెల్పీ దొరికితే.. తమ దేవుడితో ఫోటో చిక్కిందని, ఇది లైఫ్ టైమ్ మెమరీ అంటూ సంబరపడతారు.

ఇటీవల వైజాగ్ పర్యటన, ఆ తర్వాతి పరిణామాలు, వరుస ప్రెస్ మీట్స్, చంద్రబాబుతో భేటీ నేపథ్యంలో పవన్ పేరు ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కోడుతుంది..అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ.. తన ఫ్యాన్స్‌కు పవర్ స్టార్ అంతే ఇంపార్టెన్స్ ఇస్తారు. ఈ క్రమంలోనే పవన్ పవన్ కల్యాణ్ సింప్లిసిటీ తెలియజేసే మరో వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

పవన్ తన పార్టీ నేతలతో కలిసి ఎయిర్‌పోర్ట్ లోపలికి వెళ్తున్నారు. పవన్ వస్తున్న విషయం తెలియడంతో.. విమానాశ్రయంలోని మహిళా సిబ్బంది ఒకరు దూరం నుంచే ఒక్క సెల్ఫీ దిగడానికి ట్రై చేశారు. కానీ అందుకు వీలు కుదరలేదు. పవన్ కళ్యాణ్ ఆమెను దాటుకుని ఫాస్ట్‌గా ముందుకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆమెను గమనించిన పవన్.. తిరిగి వెనక్కి వచ్చి ఆమెకు సెల్ఫీ ఇచ్చారు.ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.లేడీ ఫ్యాన్ కోసం.. పవర్ చేసిన పని ఇప్పుడు నెటిజన్ల మనసు గెలుచుకుంటుంది. అభిమానులు ఈ వీడియోని చూసి మురిసిపోతున్నారు. అందుకే నిన్ను మా దేవుడు అనేది అని కామెంట్స్ పెడుతున్నారు.అందుకే పవన్ ఏం చేసినా కూడా దానికి ఓ లెక్క ఉంటుంది..

Read more RELATED
Recommended to you

Latest news