తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే కురిసిన భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపోర్లుతున్నాయి.
అండమాన్ సముద్రతీరంలో ఉపరితల ఆవర్తనం బలపడుతోంది. దీనిప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తలు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మరికొన్ని గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడనుందని, ఈ నెల 22వ తేదీ నాటికి అది మరింతగా బలపడి వాయుగుండంగా మారుతుందని వెల్లడించింది వాతావరణ కేంద్రం.
ఆ తర్వాత తుపానుగా బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని అంచనా వేసింది వాతావరణ కేంద్రం. దీంతో నల్లగొండ, నాగర్‌కర్నూలు, యాదాద్రి భువనగిరి, మెదక్, మేడ్చల్ మల్కాజిగిరి, సిద్దిపేట, నిజామాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సూర్యాపేట, మహబూబ్‌నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది వాతావరణ కేంద్రం.