పవన్ కల్యాణ్ కు బాగా నచ్చిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్ ఇదే..

-

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ బర్త్ డే సందర్భంగా సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన నటిస్తున్న ‘హరి హర వీరమల్లు ’ఫిల్మ్ నుంచి గ్లింప్స్ ను విడుదల చేయగా, అది చూసి ఆయన అశేష అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఇకపోతే పవన్ కల్యాణ్-త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతటి క్లోజ్ ఫ్రెండ్సో అందరికీ తెలుసు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ మూడు సినిమాలు చేశారు. ‘జల్సా’, ‘అత్తారింటికి దారేది’, ‘అజ్ఞాతవాసి’ సినిమాలు చేశారు. ఇందులో ‘అజ్ఞాతవాసి’ అనుకున్న స్థాయిలో ఆడలేదు. కాగా, పవన్ కల్యాణ్ సినిమాలకు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు, స్క్రీన్ ప్లే కూడా అందించారు. ‘తీన్ మార్’, ‘భీమ్లానాయక్’తో పాటు పవన్ కల్యాణ్ రెండో సినిమా ‘గోకులంలో సీత’కు డైలాగ్స్ ఇచ్చారు.

పవన్ కల్యాణ్ నటించిన ‘గోకులంలో సీత’ చిత్రంలో కథానాయికగా రాశి నటించింది. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్ అయింది. ఈ చిత్రానికి మాటలను ప్రముఖ సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి అందించారు. అప్పుడు పోసానికి అసిస్టెంట్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పని చేశారు. అలా ఆయన ‘గోకులంలో సీత’ కోసం రాసిన ఒక డైలాగ్ పవన్ కల్యాణ్ కు బాగా నచ్చింది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఆ మాటలు తాను ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటానని, అవి తనకు చాలా నచ్చాయని ఓ సందర్భంలో పవన్ కల్యాణ్ చెప్పారు. అలా త్రివిక్రమ్ రాసిన మాటలకు తొలుత పవన్ కల్యాణ్ ఇంప్రెస్ అయ్యారు. ‘గోకులంలో సీత’ చిత్రంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రాసిన ఆ డైలాగ్స్..‘‘ప్రేమే దైవం, ప్రేమే సర్వం, ప్రేమే సృష్టి మనుగడకు మూలం’ .. ఈ మాటలు పవన్ కల్యాణ్ కు బాగా నచ్చాయి. అయితే, ఈ డైలాగ్స్ రాసింది త్రివిక్రమ్ శ్రీనివాస్ అనే రచయిత అని పవన్ కల్యాణ్ కు అప్పటికి తెలుసు. కానీ, ఆ తర్వాత కాలంలో వారు మంచి మిత్రులయ్యారు. అలా వారి కాంబోలో సినిమాలు వచ్చాయి.

Read more RELATED
Recommended to you

Latest news