ఏపీ ప్రజలు తలుచుకుంటే, కచ్చితంగా సీఎం అవుతానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. ఇవాళ గణతంత్ర్య వేడుకల్లో పవన్ కళ్యాణ్ పాల్గొని.. మాట్లాడారు. తాను సీఎం కావాలని రాజకీయాల్లోకి రాలేదని.. మార్పు కోసమే వచ్చానని తెలిపారు. ఇవాళ దేశం కోసం త్యాగాలు చేసిన మహానుభావులను స్మరించుకోవాలని..మతప్రతిపాదికన దేశ విభజన జరిగిందని తెలిపారు.
వారాహి ఎలా రోడ్ల మీదకు వస్తుందో చూస్తామంటున్నారని..నేను చట్టాలను గౌరవించేవాడిని.. కోడి కత్తితో పోడిపించుకుని డ్రామాలాడేవాడిని కానని వైసీపీ పై మండిపడ్డారు. నేను సీఎం అయితే ఏంటీ.. కాకుంటే ఏంటీ..? కానీ నేను సీఎం అయితే ప్రజలకు మేలు జరుగుతుందని మీరు కోరుకుంటే అవుతానన్నారు.
సీఎం మా కులస్తుడని ఓటేస్తే ఎలా..? వైసీపీ నేతలను తిట్టడం నాకేం సరదానా..? అని నిలదీశారు. కానీ ఇష్టానుసారం మట్లాడితే నా అంత తీవ్రవాది ఉండడన్నారు. తెలంగాణ విభజన తర్వాత ఏపీ ఏమైపోతోంది…ఏపీని పాలిస్తున్న వైసీపీ నేతలకు సిగ్గుందా..? రూ. 5 వేలు ఇస్తే సరిపోతుందా..? వాలంటీర్ ఉద్యోగం సరిపోతుందా..? అని ఆగ్రహించారు.