జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యవహారశైలి ఇప్పుడు ఆయన అభిమానులకు కూడా చికాకుగా మారిందా…? అంటే అవుననే సమాధానమే వినపడుతుంది. రాజకీయంగా ముందు నుంచి స్థిరత్వం లేని పవన్ కళ్యాణ్, తెలుగుదేశంతో, వామపక్షాలతో అందరితో కూడా కలిసి ప్రయాణం చేసారు. వామపక్షాలను తీవ్రంగా వ్యతిరేకించే బిజెపితో కలిసి ప్రయాణం చేయడానికి ఇప్పుడు పవన్ సిద్దమయ్యారు.
ఎన్నికల్లో ఓడిపోయినా సరే ముందుకి వెళ్తారు అని భావించిన అభిమానులకు ఆయన వ్యవహారశైలి ఇప్పుడు చికాకుగా మారిందనే వ్యాఖ్యలు ఎక్కువగా వినపడుతుంది. వాస్తవానికి పవన్ నుంచి వాళ్ళు చాలానే ఊహించుకున్నారు అయినా సరే వారికి ఆయన నుంచి ఆశించింది మాత్రం కనపడటం లేదు. బిజెపిని చంద్రబాబు ఎంత వ్యతిరేకించారో గాని పవన్ కళ్యాణ్ మాత్రం తీవ్రంగానే వ్యతిరేకించారు.
ప్రత్యేక ప్యాకేజి అన్నప్పుడు తీవ్రంగా వ్యతిరేకించి పాచిపోయిన లడ్డూలు అన్నది పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఆ లడ్డూలు కూడా కేంద్రం ఇవ్వడం లేదు. అలాంటిది బిజెపితో ఏపీ భవిష్యత్తు ఏ విధంగా సాధ్యమో ఆయన చెప్పాల్సిన అవసరం ఉంది. అసలు బిజెపికి భవిష్యత్తు అనేది ఏపీలో లేదు. అలాంటి పార్టీతో కలిసి ముందుకి వెళ్లి 2024 లో అధికారంలోకి వస్తామని చెప్పడం విడ్డూరమే.
ఇప్పుడు పవన్ చేసేది ఏమీ ఉండదు. మోడిషా ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగానే ఆయన అడుగులు వెయ్యాలి. ఒకరకంగా జనసేన భారాన్ని మోడిషా మీదకు నెట్టి పవన్ తప్పుకున్నారు. దీనితో ఆయన అభిమానులు అసలు పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి రారు అంటూ విమర్శిస్తున్నారు. ఇప్పుడు బిజెపి చెప్పినట్టు పవన్ కళ్యాణ్ ఆడాలి గాని, పవన్ చెప్పినట్టు బిజెపి ఆడదు.