పవన్‌కు గాలిలోనే సన్మానం.. వీడియో వైరల్‌

-

పవన్​ కల్యాణ్​ పేరు వింటేనే ఫ్యాన్స్​కు పూనకాలొస్తాయి. అందరి హీరోలకు ఫ్యాన్స్​ ఉంటే.. ఈయనకు మాత్రమే భక్తులు ఉంటారు. ఎందుకుంటే పవన్​ను వాళ్లు దేవుడిలా భావిస్తారు. ఆయన ఎక్కడికైనా వస్తున్నారంటే చాలు.. పెద్దఎత్తున తరలివచ్చి ఆయన కోసం ఎదురు చూస్తుంటారు. ఈ క్రమంలోనే సోమవారం తిరుపతి జిల్లాలో పవన్​ పర్యటించి.. శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్​పై చర్యలు తీసుకోవాలని ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కోరిన సంగతి తెలిసిందే.

ఈ సందర్భంగా ఓ అభిమాని తన నాయుకుడు పవన్ కల్యాణ్‌పై ఉన్న అభిమాన్ని చూపించుకున్న విధానం అందరిని ఆకట్టుకుంది. ఓ పెద్ద క్రెయిన్‌ ఆధారంగా తాడుకు వేళాడబడుతూ.. కారులో వెళుతున్న పవన్ కల్యాణ్ వద్దకు చేరుకుని గాలిలోనే సన్మానం చేశాడు. పవన్ కల్యాణ్‌కు శాలువా కప్పడంతో పాటు పూల దండ వేసి తన అభిమానాన్ని చాటుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో.. ‘‘ఇలాంటి అభిమానులు పవన్ అన్నకే సొంతం’’ అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా.. ఎస్పీ కార్యాలయం చేరుకున్న పవన్ సీఐ పవన్ సీణ అంజూయాదవ్‌పై ఎస్పీ పరమేశ్వర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

 

View this post on Instagram

 

A post shared by pavan kalyan (@pavan_kalyan_the_hope)

Read more RELATED
Recommended to you

Latest news