రైతు అవతారం ఎత్తిన మంత్రి శ్రీనివాస్ గౌడ్

-

మంత్రి శ్రీనివాస్ గౌడ్.. ఏ కార్యక్రమంలో పాల్గొన్న.. ఎక్కడ పర్యటించిన వార్తలలో నిలవడం ఆయన ప్రత్యేకత.. అప్పటికప్పుడు.. పరిస్థితులకు అనుగుణంగా కార్యక్రమాలను నిర్వహించి వార్తలలో నిలువడం ఆయన నైజం. ఇందులో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలంలో పలు కార్యక్రమాలలో పాల్గొని తిరుగు ప్రయాణంలో చిన్న ధర్పల్లి గ్రామ సమీపంలో బాలకిషన్ అనే రైతు వరి నాట్లు వేస్తుండగా.. మంత్రి తన వాహనాలను ఆగిపించి పొలం వద్దకు వెళ్లారు.

ఎరువు చల్లి.. వరి నాట్లు వేసిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ | Minister Srinivas  Goud spread manure and planted rice

తన హోదాను పక్కన పెట్టి సాధారణ వ్యక్తిలా మారిపోయారు. నాట్లు వేసే కూలీలతో కలిసి నాట్లు వేశారు. రైతుల మారి పొలంలో ఎరువులు చల్లారు. సాగు పనులు ఎలా ఉన్నాయని రైతుబంధు, ఎరువులు అందుతున్నాయా అని వారిని ప్రేమగా అడిగా తెలుసుకున్నారు.కరెంట్ మోటారు నీళ్లు పరిశీలించి, తెలంగాణ ప్రభుత్వ హయాంలో 24 గంటల విద్యుత్ వస్తుందా లేదా అని ప్రశ్నించారు..? వస్తుంది అని రైతు సమాధానం ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ఆరోపణలను గురించి రైతుతో మంత్రి ప్రస్తావించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news