కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌కు ప్రైవేటు ఆస్పత్రిలో బిల్లు చెల్లిస్తున్నారా ? ఇది తప్పక చదవండి..!

-

కరోనా మహమ్మారి నేపథ్యంలో ప్రభుత్వ హాస్పిటళ్లు, కోవిడ్‌ కేంద్రాల్లో బెడ్స్‌ ఖాళీగా ఉండడం లేదు. దీంతో ప్రభుత్వాలు ప్రైవేటు హాస్పిటళ్లకు ఇప్పటికే కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌కు అనుమతులు ఇచ్చాయి. కానీ ఆ హాస్పిటళ్లు మాత్రం జనాల నుంచి డబ్బును అందినకాడికి పిండుకుంటున్నారు. ముంబైలో ఓ ప్రముఖ హాస్పిటల్‌ కూడా ఓ పేషెంట్‌ కుటుంబం నుంచి ఇలాగే డబ్బులు దండుకోవాలని చూసింది. కానీ వారికి అనుమానం వచ్చి అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

paying covid 19 bill in hospital read this

ముంబైలోని నానావతి సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ (ఎన్‌ఎస్‌ఎస్‌హెచ్‌)లో మే 31న 52 ఏళ్ల ఓ వృద్ధురాలిని ఆమె కుటుంబ సభ్యులు కోవిడ్‌ చికిత్స నిమిత్తమై చేర్పించారు. ఆమె చికిత్స పొందుతూ జూన్‌ 13న కన్నుమూసింది. అయితే ఆ కాలానికి గాను అయిన హాస్పిటల్‌ బిల్లును వారు చెల్లించాల్సిందిగా ఆ వృద్ధురాలి కుటుంబాన్ని అడిగారు. ఈ క్రమంలో వారు బిల్లు చెల్లించేందుకు సిద్ధ పడ్డారు. కానీ దాన్ని చూసిన వారికి అనుమానం వచ్చింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక పోలీసు విచారణలో.. ఆ హాస్పిటల్‌ కావాలనే బిల్లులను భారీగా వేసిందని నిర్దారణ అయింది.

హాస్పిటల్‌లో ఆ వృద్ధురాలికి చికిత్స అందించిన డాక్టర్లు ఎప్పటికప్పుడు పీపీఈ కిట్లను ధరించారు. అవి 5గా నమోదు చేశారు. వాటికి ఎన్‌ 95 మాస్కులు ఉచితంగా వస్తాయి. కానీ అదనంగా మరో 3 ఎన్‌ 95 మాస్కులను వాడినట్లు బిల్లులో ఉంది. కానీ వాటిని వాడారో, లేదో చెప్పలేదు. పేషెంట్‌కు గాను ఆమె కుటుంబ సభ్యులు ఒకేసారి కోవిడ్‌ ట్రీట్‌మెంట్‌ ప్యాకేజీ తీసుకున్నారు. ఆ ప్యాకేజీలో భాగంగా హాస్పిటల్‌ వారు మెడిసిన్స్‌ ఇవ్వాలి. అందుకు ప్రత్యేకంగా చార్జిలు వేయకూడదు. కానీ ఆమెకు నిత్యం ఇచ్చిన యాస్పిరిన్‌, బి-కాంప్లెక్స్‌, పారాసిటమాల్‌ తదితర మెడిసిన్లకు ప్రత్యేకంగా బిల్లు వేశారు.

ఆ వృద్ధురాలికి హాస్పిటల్‌ సిబ్బంది నిత్యం అనేక టెస్టులు చేశారు. కొన్ని టెస్టులను ఒకటి కన్నా ఎక్కువ సార్లు ఒకేసారి చేశారు. అందువల్ల వాటికి బిల్లులు అదనంగా వచ్చాయి. ఇక ఆక్సిజన్‌ను అవసరం లేకున్నా నిత్యం 12 గంటల పాటు ఉంచారు. దానికి గాను అదనపు చార్జీలు వేశారు. అర్థరాత్రి 1 నుంచి 3 గంటల మధ్య ఎమర్జెన్సీ పేరిట పలు టెస్టులు చేశారు. అది రాత్రి కనుక ఆ సమయంలో డబుల్‌ చార్జి వేశారు. ఇది అనుమానాస్పదంగా అనిపించింది. ఇక ఇలాంటి అనుమానాస్పదంగా ఉన్న అనేక పాయింట్లను బిల్లులో పోలీసులు వైద్య నిపుణుల పర్యవేక్షణలో గమనించారు. అందువల్ల హాస్పిటల్‌ వారు కావాలనే అత్యధికంగా బిల్లులను వేసినట్లు నిర్దారణ చేశారు. అయితే ఈ కేసు విచారణ ఇంకా కొనసాగుతోంది. తదుపరి హాస్పిటల్‌ యాజమాన్యంపై అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనా.. మీరు కూడా ఇలా ప్రైవేటు హాస్పిటల్‌లో కోవిడ్‌ మాత్రమే కాదు, ఇతర ఏ అనారోగ్య సమస్యకు చికిత్స తీసుకున్నా వారు ఇచ్చే బిల్లులను ఒక్కసారి క్షుణ్ణంగా పరిశీలించండి. తరువాతే బిల్లులు చెల్లించండి. లేదంటే.. ఇదిగో.. ఇలాగే మోసం చేస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news