ధోని ని డీజిల్ ఇంజన్ తో పోల్చిన డివిలియర్స్..!

-

2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టార్ట్ అయ్యింది. 17వ ఐపీఎల్ 2024 సీజన్ కి రెడీ అయింది ఈ టోర్నమెంట్లో 10 జట్లు పాల్గొనడానికి సిద్ధమయ్యాయి ఈ మెగా టోర్నీ మార్చి 22న ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు తలపడబోతున్నాయి. ఈ రెండు జట్లపై దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ డివిలియర్స్ స్పందించారు. మహేంద్రసింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ప్రశంసలు కురిపించారు ఏబీ.

ఎంఎస్ ధోని ఎప్పటికీ అంతం లేని డీజిల్ ఇంజిన్ అని అన్నారు. ఒక ఆటగాడు చాలా కాలం పాటు అత్యున్నత స్థాయిలో ఆడడం కష్టమని అన్నారు. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ధోని తన అమూల్యమైన ప్రదర్శన చేస్తున్నాడని గత కొన్నేళ్లుగా క్యాష్ రీచ్ లీగ్ లో తన ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకుంటున్నాడని చెప్పుకొచ్చారు ముంబై ఇండియన్స్ తో పాటు ఎక్కువ ఛాంపియన్షిప్ లన్ని గెలుచుకోవడం ద్వారా సీఎస్కే ఒక శక్తిగా నిలిచిపోయిందని ఏబీ అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news