రిటైర్ అయ్యాక పెన్షన్ కావాలా..? అయితే ఇవి తప్పక తెలుసుకోండి..!

-

రిటైర్ అయ్యాక చాలా మంది వచ్చిన పెన్షన్ తో హాయిగా జీవించాలని అనుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగులకి ఎలానో పెన్షన్ వస్తుంది. ప్రయివేట్ ఉద్యోగం చేసే వారు కూడా పెన్షన్ ని పొందాలంటే స్కీమ్స్ లో డబ్బులు పెడుతూ ఉండాలి.

ప్రయివేట్ ఉద్యోగం వారికి పెన్షన్ రాకపోతే జీవితం గడిపేందుకు ఇబ్బందిగా మారుతుంది. కనుక ముందు నుండే ప్లాన్ చేసుకోవాలి. ముందే ప్లాన్ చేసుకోకపోతే పదవీ విరమణ తర్వాత చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. రిటైర్ అయ్యాక ఆనందంగా ఉండాలంటే వీటిని తప్పక గుర్తు పెట్టుకోవాలి.

పదవీ విరమణ కోసం డబ్బులని ఎవరు సేవ్ చెయ్యరు. పీఎఫ్, బీమా వంటి ప్రయోజనాలు చాలని అనుకుంటారు. మీ పదవీ విరమణ అవసరాలన్నింటినీ ఇవి తీర్చలేవు. కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. రిటైర్మెంట్ కోసం ప్లాన్ చేసుకోవాలి. జీతంలో కొంత భాగంతో మీ కోసం తగిన రిటైర్మెంట్ ఫండ్‌ను ఉంచాలి.
పదవీ విరమణ కోసం పెట్టుబడి పెడుతూ ఉండాలి.
మీరు మీ మొదటి చెల్లింపును పొందినప్పుడు నుండి కూడా రిటైర్మెంట్ కోసం ఆలోచించాలి. ఇలా చేస్తేనే దీర్ఘకాలంలో పెద్ద మొత్తంలో డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఎంత సేవ్ చెయ్యాలి..?

25 ఏళ్ల వ్యక్తి రిటైర్ అయ్యే వరకు కోటి రూపాయలు సేవ్ చేయాలని ప్లాన్ చేస్తే.. పెట్టుబడిపై 12% వార్షిక రాబడిని పొందాలని అనుకుంటే అప్పుడు నెలకు దాదాపు 2 వేల రూపాయలు పెట్టుబడి పెట్టాలి. 45 ఏళ్ల నుంచి ఇన్వెస్ట్ చెయ్యాలంటే నెలకు రూ.12,000 పెట్టుబడి పెట్టాలి. బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా రిటైర్మెంట్ ఫండ్‌ను సృష్టించుకోవచ్చు.
వీటిలో PPF, రికరింగ్ ఖాతా, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ స్కీమ్‌తో పాటు ఇంకా చాలా స్కీమ్స్ వున్నాయి.

 

Read more RELATED
Recommended to you

Latest news