అంగట్లో అన్నీ ఉన్నా కూడా అల్లుడి నోట్లో శని ఉంటే పైకి రాదు.. అన్న మాటమే నిజమే.. ఎంతగా మనం సొమ్ము చేసుకోవాలని ప్రయత్నాలు చేసినా కూడా దరిద్రం ఉంటే కలిసి రాదు.. ఇంకా నష్టాలు పెరుగుతాయి..మొదలుపెట్టిన కూడా పనిలో ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. ఇంకొందరు ఎటువంటి పనులు మొదలుపెట్టినా కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అవుతూ ఉంటాయి..అయితే కొంతమంది వాస్తు పరిహారాలను పాటిస్తే మరి కొందరు దేవుళ్లను భక్తిశ్రద్ధలతో పూజిస్తూ ఉంటారు. కొంతమంది ఎన్ని పనులు చేసినా కూడా ఎటువంటి ఫలితాలు కనిపించలేదు అని దిగులు చెందుతూ ఉంటారు. అటువంటి వారు ఈ పరిహారాలు ఒకసారి ప్రయత్నించండి..
దరిద్రాన్ని ప్రారద్రోలడానికి కొబ్బరికాయ మంచి పరిష్కారం..కొబ్బరికాయ, పచ్చ కర్పూరం ఎంతో ప్రాధాన్యత ఉంది. తలరాత మార్చుకోవడం కోసం కొబ్బరికాయ తలపై పచ్చకర్పూరం పెట్టి వెలిగించి,21 సార్లు దిష్టి తీసుకోవాలి. ఆ తర్వాత ఆ కొబ్బరి కాయను ప్రవహించే నీటిలో వదిలేయాలి. ఒకవేళ ఇంట్లో మీలాంటి వాళ్లు ఎక్కువ మంది ఉంటే వారికి ఒక్కొక్కరికి ఒక్కో కొబ్బరికాయను వాడాలి. ఏడాదికి రెండు సార్లు ఈ విధంగా చేయడం వల్ల మీకు అంతా మంచే జరిగి మంచి ఫలితాలు కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు..
ఇకపోతే ఈ పరిహారాన్ని మంగళవారం, గురువారం శనివారాల్లో మాత్రమే పాటించాలి. అదేవిధంగా దురదృష్టం వెంటాడుతుంది అనుకునే వారు శనిదేవుడిని పూజించడం చాలా మంచిది.. శనిదేవుడికి నిత్యం పూజ చేయడం వల్ల ప్రయోజనం కలుగుతుంది. అలాగే ఇంట్లో ఉండే పాడైపోయిన గడియారం లేదా పగిలిన గాజును వెంటనే తీసివేయాలి. అలాగే ఆవుకు ప్రతిరోజు గడ్డి తినిపిస్తే చాలా మంచిది. శని దేవుడి అనుగ్రహం కోసం ఈ పరిహారం అద్భుతంగా పని చేస్తుంది. అలాగే వికలాంగులకు అన్నదానం చెయ్యడం మంచిది. సంవత్సరానికి రెండుసార్లు చెయ్యడం మంచిది..మూగజీవులకు ఆహారాన్ని కూడా ఇవ్వడం మంచిదే..