పొలాల్లో వ‌జ్రాల కోసం వేట‌.. క‌ర్నూలు‌లో అదృష్ట‌వంతులైన ప‌లువురు..!

-

వ‌జ్రం.. ఎంతో విలువైంది. బంగారం క‌న్నా మార్కెట్‌లో ఎక్కువ ధ‌ర ప‌లుకుతుంది. ఒక్క వ‌జ్రం ఉంటే చాలు.. ల‌క్షాధికారి అయిపోవ‌చ్చు. అలాంటి వ‌జ్రాలు అప్ప‌నంగా దొరికితే.. అంతకు మించిన అదృష్టం ఇంకేముంటుంది. స‌రిగ్గా అదే జ‌రిగింది. క‌ర్నూలులో తొల‌క‌రి జ‌ల్లుల‌కు కొంద‌రికి వ‌జ్రాలు దొరికాయి. దీంతో ఇప్పుడ‌క్క‌డ అనేక మంది త‌మ అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్నారు.

people are searching for diamonds in fields

కర్నూలులోని జొన్నగిరి, తుగ్గలి, పగిడిరాయి, జీ.ఎర్రగుడి, బొల్లవాని పల్లి, చెన్నంపల్లి, పి.కొత్తూరు, చిన్న జొన్నగిరి, రాంపురం, ఉప్పర్లపల్లి తదితర గ్రామాల్లో గ‌త రెండు రోజుల కింద‌ట కురిసిన తొల‌క‌రి జ‌ల్లుల‌కు ప‌లువురికి పొలాల్లో వ‌జ్రాలు దొరికాయి. రూ.2 ల‌క్ష‌ల విలువైన వ‌జ్రాల‌ను కొంద‌రు త‌మ పొలాల్లో గుర్తించారు. వాటిని మార్కెట్‌లో వ్యాపారుల‌కు అమ్మి డ‌బ్బు పొందారు. దీంతో అక్క‌డి జ‌నాలు ఉద‌యం అయిందంటే చాలు.. పొలాల్లో వ‌జ్రాల వేట మొద‌లు పెడుతున్నారు.

ఆయా ప్రాంతాల‌కు చుట్టు ప‌క్క‌ల జిల్లాల నుంచి కూడా వ‌చ్చి పొలాల్లో వ‌జ్రాల కోసం వెదుకుతుంటారు. అయితే క‌రోనా వ‌ల్ల ఈ సారి ఆయా గ్రామాల‌కు వెళ్లే వారి సంఖ్య త‌గ్గింది. అయిన‌ప్ప‌టికీ కొంద‌రు మాత్రం నిత్యం పొలాల్లో వ‌జ్రాల కోసం వెదుకుతూనే ఉన్నారు. ఏమో.. ఎవ‌రి అదృష్టం ఎలా ఉంటుందో ఎవ‌రికి తెలుసు.. అదృష్ట‌వంతులైతే ఎక్కువ ఖ‌రీదు గ‌ల వ‌జ్రాలు దొర‌క‌వ‌చ్చు క‌దా..!

Read more RELATED
Recommended to you

Latest news