మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా భారీగా ఆందోళన జరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో పోలీసులు, నిరసనకారుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. పశ్చిమబెంగాల్‌లోని హౌరాలో శనివారం పోలీసులు, నిరసనకారుల మధ్య జరిగిన ఘర్షణపై సీఎం మమతా బెనర్జీ స్పందించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం మమతా బెనర్జీ తీవ్రంగా విమర్శించారు. బీజేపీ చేసిన తప్పులకు ప్రజలను బలి చేస్తున్నారని, ప్రజలను ఎందుకు మత రాజకీయాల్లోకి లాగుతున్నారని ఆమె నిలదీశారు.
ఈ ఘర్షణ వెనుక కొన్ని రాజకీయ పార్టీల ప్రమేయం ఉందన్నారు. ఈ ఘర్షణకు కారణమైన ప్రతిఒక్కరిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళన చేస్తున్నారని, కొన్ని రాజకీయ పార్టీలు వెనకనుండి అల్లర్లను ప్రేరేపిస్తున్నారని సీఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. శుక్రవారం జరిగిన అల్లర్లలో పోలీసులు ఇప్పటివరకు 70 మందిని అరెస్ట్ చేశారు. కాగా, ఉలుబెరియ సబ్ డివిజన్‌లో జూన్ 15వ తేదీ వరకు 144 సెక్షన్ అమలు చేశారు. ఈ హింసాకాండను అదుపులోకి తీసుకురావడానికి బీజేపీ ఎంపీ, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు సౌమిత్ర ఖాన్, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ సాను కోరామని దీదీ అన్నారు.