గత నాలుగు నెలల కింద… ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక తాలిబన్లు రాజ్యాధికారం చేపట్టినప్పటి నుంచి ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు నానా కష్టాలు పడుతున్నారు. తాలిబన్లు అమలుపరుస్తున్న నిబంధనల కారణంగా… అక్కడి ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. మహిళలు బయటికి రావాలంటే గజగజ వణికి పోయే పరిస్థితి అక్కడ నెలకొంది.
అటు ఆకలి చావులు కూడా రోజురోజుకు పెరుగుతున్నాయి. దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు. ముఖ్యంగా తమ కుటుంబ సభ్యులు ఆకలి తీర్చడానికి అవయవాలను అమ్ముకుంటున్న సంఘటనలు కూడా ఆఫ్ఘనిస్తాన్ దేశంలో రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. హెరాత్ ప్రావిన్స్ లో కిడ్నీల విక్రయం ఎక్కువగా సాగుతోంది. ఆపరేషన్ జరిగిన తర్వాత రెస్ట్ లేకుండా రెండు మూడు నెలలకే పనుల్లోకి వెళుతున్నారు. వారి కిడ్నీలను అమ్మి కుటుంబసభ్యుల ఆకలిని తీరుస్తున్నాయి. ఈ ఘటన ప్రపంచ వ్యాప్తంగా అందరినీ కలిచి వేస్తోంది. తాలిబన్ల అరాచక పాలన కారణంగా తమకు ఇలాంటి ఇ భాగ్య పరిస్థితి ఎదురైంది అని అక్కడి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.