నన్ను భారత దేశ అల్లుడిగా పిలుస్తారు : రిషి సునక్

-

జీ20 సదస్సుకు హాజరయ్యేందుకు ఢిల్లీ చేరుకున్న బ్రిటన్ ప్రధాని రిషి సునక్ లండన్ నుండి బయలుదేరడానికి ముందు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత్‌కు వెళ్లడం తనకు చాలా ప్రత్యేకమని చెప్పారు. తనను భారతదేశ అల్లుడిగా వ్యవహరిస్తారని, ఆప్యాయతతో అలా పిలుస్తారన్నారు. భారత్ తన మనసుకు చాలా దగ్గరి దేశమన్నారు. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణమూర్తి కూతురు అక్షితామూర్తిని రిషి సునక్ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు అక్షిత కూడా భారత్ కు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు.

British PM Rishi Sunak arrives for G20 Summit-Telangana Today

రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన ముఖం చూపించుకోలేకే జి20 సదస్సుకి రావడం లేదని మండి పడ్డారు రిషి సునాక్. కావాలనే ఈ సమ్మిట్‌కి దూరంగా ఉన్నారని, విమర్శలు వస్తాయని ఆయనకీ తెలుసని అన్నారు. “రష్యా అధ్యక్షుడు పుతిన్‌ తన ముఖం చూపించుకోలేకనే జి20 సదస్సుకి రావడం లేదు. కావాలనే అందరికీ దూరంగా ఉంటున్నారు. విమర్శలు ఎదుర్కొనే ధైర్యం ఆయనకు లేదు. ఈ సదస్సులో పాల్గొనే దేశాలు కచ్చితంగా రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంపై చర్చిస్తాయి. సమస్య పరిష్కారానికి యూకే అన్ని విధాలుగా సహకరిస్తుంది. మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్న రష్యాపై చర్యలు తీసుకునేందుకు భారత్‌ కీలక పాత్ర పోషించనుంది. త్వరలోనే ఈ సైనిక చర్య ముగిసేలా చర్యలు చేపట్టాల్సిన అవసరముంది” అని అన్నారు ఆయన.

 

 

Read more RELATED
Recommended to you

Latest news