దేశంలోని మొత్తం 6 రాష్ట్రాలలో ఏడు అసెంబ్లీ స్థానాలకు గానూ ఇటీవల ఉప ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. కాగా తాజాగా ఈ ఉప ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల ఫలితాలలో ఇప్పటికే మూడు చోట్ల అధికార బీజేపీ ఓటమి పలు కాగా.. ఒక్క స్థానంలో మాత్రం ఇంకా ఫలితం వెలువడలేదు.. కానీ లీడ్ లో బీజేపీ లేకపోవడం తో ఇక ఓటమి ఖరారు అయినట్లే. ఇక కేవలం మూడు చోట్ల మాత్రమే బీజేపీ విజయం దక్కించుకుంది, గెలిచిన స్థానాలలో త్రిపుర రాష్ట్రంలో ధన్ పూర్ మరియు బాక్సానగర్ లు మరియు ఉత్తరాఖండ్ లోని భాగేశ్వర్ లు ఉన్నాయి. ఇక ఓడిపోయిన బెంగాల్ లోని ధూప్ గురి , కేరళ లోని పూత్తుపల్లి నియోజకవర్గాలలో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. ఇక జార్ఖండ్ లోని డుమ్రి లో అధికారంలో ఉన్న JMM పార్టీ విజయం సాధించింది.
ఉత్తరప్రదేశ్ లోని ఘోసి లో సైతం బీజేపీ వెనుకబడి ఉంది.. ఇక్కడ సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి లీడింగ్ లో ఉన్నారు. బీజేపీ మొత్తం నాలుగు చోట్ల ఓడిపోవడం అంటే పెద్ద షాక్ అని చెప్పాలి.