హుజురాబాద్ ఉపఎన్నిక ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే : ఆ పార్టీకి షాక్ !

-

హుజురాబాద్ ఉపఎన్నిక పై ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే రిపోర్ట్ వెలువడింది. అయితే ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే.. అధికార టిఆర్ఎస్ పార్టీ కి మాత్రం ఊహించని షాక్ తగిలింది. హుజురాబాద్ ఉప ఎన్నిక లో ఓటర్లు బిజెపి పార్టీ కి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినట్లు ఈ ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే చెబుతోంది. బిజెపి – టి ఆర్ఎస్ మధ్య 7-9 శాతం ఓట్ల వ్యత్యాసం ఉండే అవకాశం ఉన్నట్లు స్పష్టం చేసింది ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే రిపోర్ట్.

Huzurabad | హుజురాబాద్
Huzurabad | హుజురాబాద్

మార్జిన్ అఫ్ ఎర్రర్ + (ప్లస్) ఆర్ – (మైనస్) 3 శాతం ఉన్నట్లు ప్రకటించింది. అలాగే హుజురాబాద్ పోలింగ్ లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ గల్లంతు అయినట్లు అర్థం అవుతోంది. బిజెపి పార్టీ అభ్యర్ధి ఈటెల రాజేందర్ కు సానుభూతి, నియోజకవర్గ ప్రజలతో ఉన్న సత్సం బంధాల తో సానుకూలత వచ్చినట్లు ఈ సర్వేలో తేలింది. అలాగే ఈటెల రాజేందర్ వ్యక్తిగత ఇమేజ్ కూడా కలిసొచ్చినట్లు అర్థమవుతోంది.

సైలెంట్ ఓటింగ్ పని చేస్తే మెజార్టీ ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని ఈ ‘పీపుల్స్ పల్స్’ మూడ్ సర్వే లో తేలింది. అన్ని సామాజికవర్గాలు… ముఖ్యంగా యువత మద్దతు బిజెపి వైపే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే ప్రకారం టిఆర్ఎస్ డబ్బు పంపిణీ వికటించినట్లు అర్థమవుతోంది.. కాగా హుజురాబాద్ లోకాసేపటి క్రితమే పోలింగ్ ముగిసింది. కోవిడ్ పేషెంట్ల, లక్షణాలు ఉన్న వ్యక్తులకు ఓటు వేసే అవకాశం కల్పించారు అధికారులు. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు మాత్రమే అవకాశం కలిపిస్తున్నారు. రాత్రి 9 గంటల వరకు ఓటింగ్ శాతాన్ని ప్రకటించనున్నారు ఎన్నికల అధికారులు.

Read more RELATED
Recommended to you

Latest news