కరోనా వైరస్ ఇప్పుడు విలయతాండవం చేస్తుంది. దేశ వ్యాప్తంగా ఇప్పుడు కరోనా వైరస్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. ఎన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకున్నా సరే అది విస్తరిస్తూనే ఉంది. కరోనా వైరస్ ని కట్టడి చెయ్యాలి అంటే కచ్చితంగా ప్రజల సహకారం కావాలి. ఇప్పుడు దేశంలో కరోనా వైరస్ క్రమంగా పెరుగుతుంది. తగ్గినట్టే తగ్గిన వైరస్ ఇప్పుడు మళ్ళీ తన విశ్వరూపం చూపిస్తుంది మన దేశంలో.
కాబట్టి ప్రజలు అందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. వైరస్ తగ్గింది కదా అని బయటకు వస్తే మాత్రం ప్రాణాల మీదకు తెచ్చుకున్నట్టే… లాక్ డౌన్ ని ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో ఎత్తివేసినా సరే ప్రజలు ఎవరూ కూడా దయచేసి బయటకు రాకండి. దాదాపు నెల రోజుల పాటు ఎవరి ఇంట్లో వాళ్ళు ఉండటమే మంచిది. విద్యార్ధుల చదువులు అని అది అని ఇదని బయటకు వస్తే ప్రమాదం తెచ్చుకున్నట్టే.
ఇప్పుడు కరోనా మన దేశంలో దాదాపు మూడో దశలో ఉంది అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన తరుణం ఇది. జలుబు వచ్చినా జ్వరం వచ్చినా సరే వెంటనే… అధికారులకు సమాచారం ఇవ్వండి. మీరు ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్లి పరిక్షలు చేయించుకుంటే మాత్రం అది వేరే వారికి సోకే అవకాశాలు ఉంటాయి. దయచేసి మీరు నెల రోజుల పాటు బయటకు రాకుండా ఉండాల్సిన అవసరం ఉంది.