బాలకృష్ణ ఓ అమాయక చక్రవర్తి : పేర్ని నాని సెటైర్

-

నందమూరి బాలకృష్ణ ఓ అమాయక చక్రవర్తి అంటూ మంత్రి పేర్ని నాని కౌంటర్‌ ఇచ్చారు. చంద్రబాబు ఏం చెప్తే అదే నిజమని అయన అనుకుంటున్నారని బాలయ్య అనుకుంటున్నారని… అందరి ఇళ్లల్లో ఆడవారు ఉన్నారు. ‌అలాంటిది మేము ఎందుకు తిడతాము? అని తెలిపారు పేర్ని నాని. అసలు అసెంబ్లీలో వ్యవసాయం మీద చర్చ జరుగుతుంటే దానిపై ఒక్క ప్రశ్న ఐనా వేశారా? అని నిలదీశారు. చంద్రబాబు తన మేధాశక్తిని క్రోడీకరించి మెలోడీ డ్రామాను క్రియేట్ చేశారని… ఇది దురదృష్టకరమని తెలిపారు. అసెంబ్లీలో ఎవరూ చంద్రబాబు కుటుంబ సభ్యులు, వారి శ్రీమతి ప్రస్తావనే తేలేదని… రాజకీయాలను రాజకీయంగానే ఎదుర్కోవాలని పేర్కొన్నారు.

దాన్ని పక్కన పెట్డి మెలోడీ డ్రామా కోసం కుటుంబ సభ్యులను తెరమీదకు తెచ్చారని… చంద్రబాబు కుటుంబ సభ్యులను ఎవరు? ఏమన్నారో చెప్పాలని సవాల్‌ విసిరారు. చంద్రబాబు మాటలను వీడియో తీశారు కదా? అందులో ఎక్కడైనా దూషణల గురించి ఉందా? అని నిలదీశారు. అనని మాటని, జరగని విషయాన్ని చెడుగా చిత్రీకరించి రాజకీయంగా వాడుకోవటం దురదృష్టకరమని పేర్ని నాని ఫైర్‌ అయ్యారు. రాజకీయాలు ఈ స్థితికి దిగజారటానికి కారణం చంద్రబాబేనని… తెలుగు రాజకీయాలు చూసేవారికి మరోసారి చెప్తున్నామన్నారు. మరోసారి చెప్తున్నాం.. చంద్రబాబు చేస్తున్న నీచ రాజకీయాలను నమ్మవద్దని కోరారు. ప్రజల గుండెల్లో నిలిచిన ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల్లో విషాన్ని ఎక్కిస్తున్నారని… ఇంతకంటే వికృత రాజకీయాలు దేశంలో ఎక్కడా లేవని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news