మానవత్వం చాటుకున్న మాజీ మంత్రి పేర్నినాని

-

వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పేర్ని నాని నేడు మచిలీపట్నంలో పర్యటించారు. అక్కడ ఆయన ఒక వృద్ధురాలిని కాళ్లకు చెప్పులు లేకుండా మండుటెండలో వెళుతుండటం చూశారు. దాంతో ఆయన మనసు కరిగిపోయింది. ఆమెకు చెప్పులు కొనిచ్చి మానవత్వం ఎమ్మెల్యే పేర్ని నాని.

Perni Nani : చెప్పులు లేకుండా ఎండలో నడిచిన వృద్ధురాలు.. షోరూంకు తీసుకెళ్లిన  పేర్ని నాని - NTV Telugu

ఆ సమయంలో పేర్ని నాని కారులో అటునుండి పర్యటిస్తున్నారు. ఎండదెబ్బకు జన సంచారం ఎక్కువగా లేని ఆ సమయంలో, వృద్ధురాలు కాళ్లకు చెప్పులు కూడా లేకుండా నడస్తుండడం పట్ల ఆయన దృష్టిని మళ్లింది . దీంతో ఆయన వెంటనే కారు ఆపి, ఆ వృద్ధురాలి వివరాలు తెలుసుకున్నారు. ఆమె పేదరాలు అని తెలుసుకున్న ఆయన, ఆమెను ఓ చెప్పుల షోరూంకు తీసుకెళ్లి, ఆమెకి నచ్చిన చెప్పులు కొనిపెట్టారు నాని. చెప్పులు ఎలా ఉన్నాయమ్మా… లూజుగా ఉన్నాయా… సరిపోయాయా అంటూ ఆమెని అడిగారు. చెప్పులు కొనిచ్చిన పేర్ని నానికి ఆ వృద్ధురాలు చేతులు జోడించి వందనాలు తెలుపుకుంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

 

 

Read more RELATED
Recommended to you

Latest news