ప్రధానులను మార్చే చంద్రబాబు..ఎన్టీఆర్‌కు “భారత రత్న” ఎందుకు ఇప్పించలేదు : పేర్ని నాని

ఎన్టీఆరుని ఓ ప్రాంతానికో.. కులానికో పరిమితం చేయొద్దన్నారు పేర్ని నాని. తెలుగు రాష్ట్రాల్లో ప్రభావం చూపగల వ్యక్తి ఎన్టీఆర్ అని.. ప్రధానులనే నియమించి చక్రం తిప్పానన్న చంద్రబాబు.. ఎన్టీఆరుకు భారత రత్న ఎందుకు ఇప్పించలేదు..? అని నిలదీశారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా పెట్టాలన్న ఆలోచనను చంద్రబాబు ఎందుకు చేయలేదు..? అని.. కొత్త జిల్లాల ఏర్పాటు అనేది రాత్రికి రాత్రే తీసుకున్న నిర్ణయం కాదని ఫైర్‌ అయ్యారు.

perni nani

రెండేళ్ల పాటు కసరత్తు చేసిన అనంతరం కొత్త జిల్లాల ఏర్పాటు పై నిర్ణయం తీసుకున్నామని.. పీఆర్సీ నుంచి డైవర్ట్ చేయడం కోసం కొత్త జిల్లాల ఏర్పాటు అం శాన్ని తెర మీదకు తెచ్చామనడం కరెక్ట్ కాదని తెలిపారు. ఉద్యోగులతో చర్చల కోసం మూడు రోజులు కాదు.. 30 రోజులైనా వేచి చూస్తామని.. ఉద్యోగులతో చర్చల విషయమై ప్రభుత్వమే ముందడుగు వేసిందని మంత్రి పేర్ని నాని చెప్పారు. ప్రభుత్వం వేసిన కమిటీ గురించి అధికారికంగా చెప్పలేదంటే.. జీవో ఇచ్చా మన్నారు.