Personality test: మీ కాళ్ళ వేళ్ళను బట్టీ మీ వ్యక్తిత్వం గురించి తెలుసుకోండి..!

-

మనం మన యొక్క కాళ్ళ వేళ్ళని బట్టి కూడా మన ప్రవర్తన, వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అనేది తెలుసుకోవచ్చు. అందరి పాదాలు ఒకేలా ఉండవు ఒక్కొక్కరి పాదాల వేళ్ళు ఒక్కో విధంగా ఉంటాయి అయితే మరి మీ పాదాల వేళ్ళు ఎలా ఉన్నాయి..?, మీ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది అనేది ఇప్పుడు చూద్దాం.

 

బొటన వేలు అన్ని వేళ్ళ కంటే పొడుగ్గా ఉంటే:

మీ పాదాల వేళ్లలో బొటన వేలు పెద్దగా ఉన్నట్లయితే మీరు చాలా క్రియేటివ్ గా ఫాస్ట్ గా ఇన్నోవేటివ్ గా ఉన్నట్లు అర్థం. అదేవిధంగా మీరు చాలా తెలివైన వాళ్ళు మీ పనులను చక్కగా పూర్తి చేసుకుంటారు. అలానే మీరు నేచర్ లవర్ కూడా. సులభంగా మీరు ఇతరులను స్నేహితులుగా మార్చుకోగలరు. అలానే మీ రహస్యాలను ఇతరులకు ఎక్కువగా పంచుకోరు.

బొటన వేలు అన్ని వేళ్ళ కంటే పొట్టిగా ఉంటే:

మీ బొటనవేలు అన్ని వేళ్ళ కంటే చిన్నగా ఉన్నట్లయితే మీరు చక్కగా ప్లానింగ్ చేస్తారు. అలానే మీ యొక్క గోల్స్ మీద దృష్టి పెడతారు. ఎంత పనినైనా సులభంగా చేయగలరు.

రెండవ వేలు అన్ని వేళ్ళ కంటే పొడవుగా ఉంటే:

రెండవ వేలు అన్ని వేళ్ళ కంటే పొడవుగా ఉన్నట్లయితే మీరు చాలా క్రియేటివ్ గా యాక్టివ్ గా ఉంటారు. అలానే మీరు ఎక్కువ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటారు. అలానే మీకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టం. పెట్రోల్ వాసన అంటే మీకు చాలా ఇష్టం ఉంటుంది. వాటర్ ఫాల్స్ వంటి వాటిని మీరు ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కాంపిటీషన్స్ కి ఎక్కువగా వెళుతూ ఉంటారు.

రెండవ వేలే అన్నింటి కంటే చిన్నదిగా ఉంటే:

మీకు మీరు స్వయంగా నిలబడడం కష్టం ఎప్పుడు ఇతరులపై ఆధార పడుతూ ఉంటారు. ఎక్కువగా మిమ్మల్ని మీరు ప్రోత్సహించుకోరు. మీకు మీరుగా నిర్ణయాలు తీసుకోలేరు.

అన్నింటికంటే మూడవ వేలు చిన్నదిగా ఉంటే:

కష్టమైన పనులు కాని రెస్పాన్సిబిలిటీ కాని వస్తే మీరు తప్పించుకుంటారు. మీ పని చేయడానికి మీరు ఇతరలని అడుగుతారు. ఎక్కువగా మీరు బద్దకిస్తు వుంటారు. మోటివేషన్ మీకు అవసరం.

Read more RELATED
Recommended to you

Latest news